పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మాజీ భార్య రెహామ్‌ఖాన్ పరువునష్టం దావా కేసులో విజయం సాధించారు. వివరాల్లోకి వెళితే... బ్రిటీష్ జాతీయురాలైన రెహామ్‌ఖాన్‌పై 2018 జూన్ నెలలో పాకిస్తాన్‌కు చెందిన దునియా టీవీ ‘‘ఆన్ ది ఫ్రంట్ విత్ కమ్రాన్ షాహిద్’’ పేరుతో ఓ కార్యక్రమం ప్రసారం చేసింది.

దీనిలో భాగంగా ప్రస్తుత పాక్ రైల్వేశాఖ మంత్రి షేర్ రషీద్.. రెహమ్‌ఖాన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యల కారణంగా పరువుకు నష్టం వాటిల్లినందుకు గాను దునియా టీవీ క్షమాపణలు చెప్పింది.

సోమవారం లండన్‌లోని యూకే హైకోర్టు జడ్జ్ జస్టిస్ మాథ్యూ నిక్లిన్ తీర్పు చెబుతూ.. పాక్ ఛానెల్ తన క్లయింట్‌కి బహిరంగ క్షమాపణ చెప్పిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో న్యాయమూర్తి ఆదేశాల ప్రకారం నష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చుల్ని సైతం భరిస్తామని పేర్కొంది.

Also Read:సెక్స్ జీవితాలు: ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్యకు వసీం అక్రమ్ లీగల్ నోటీసు

దీనిపై రెహమ్‌ఖాన్ స్పందిస్తూ దునియా టీవీ క్షమాపణలు చెప్పడం సంతోషంగా ఉందన్నారు. దునియా టీవీ తనపై ప్రసారం చేసిన కార్యక్రమంపై ఆమె యూకే మీడియా వాచ్ డాగ్, ఆఫీస్‌ ఆఫ్ కమ్యూనికేషన్స్‌కు ఫిర్యాదు చేశారు.

దీనిని సదరు సంస్థ సైతం తప్పుబట్టింది. తాజాగా న్యాయస్థానం‌లో సైతం తనకు అనుకూలంగా తీర్పు రావడం పట్ల రెహామ్‌ఖాన్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన నిజాయితీని నిరూపించుకోవడానికి సుదీర్ఘ న్యాయపోరాటం చేయాల్సి రావడం కాస్త బాధత కలిగించిందని ఆమె పేర్కొన్నారు. 

కొద్దిరోజుల క్రితం రేహం ఖాన్ తాను రాయబోయే పుస్తకంలో కొందరి సెక్స్ జీవితాల గురించిన ప్రస్తావన సంచలనం సృష్టించింది. అందుకు గాను ఆమెకు నలుగురు వ్యక్తలు లీగల్ నోటీసులు ఇచ్చారు. లీగల్ నోటీసులు ఇచ్చిన క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ కూడా ఉన్నాడు. 

Also Read:తీవ్ర వ్యాఖ్యలు: ఐక్యరాజ్యసమితి వేదికగా మోడీపై ఇమ్రాన్ అక్కసు

రేహం ఖాన్ తాను త్వరలో వెలువరించే పుస్తకంలోని విషయాలు ఇటీవల ఆన్ లైన్లో లీకయ్యాయి. దీనిపై భగ్గుమన్న వ్యక్తులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. 

రేహం మొదటి భర్త డాక్టర్ ఇజాజ్ రెహ్మాన్, క్రికెటర్ వసీం అక్రమ్, బ్రిటిష్ వ్యాపార వేత్త సయ్యద్ జుల్ఫీకర్ బుఖారీ, ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్ -ఐన్సాఫ్ మీడియా సమన్వయకర్త అనిల ఖవాజా ఆమెకు లీగల్ నోటీసులు ఇచ్చారు. 

రేహం ఖాన్ తన పుస్తకంలో వివిధ సెలిబ్రిటీలతో తను ములాఖత్ ల గురించి, ఇమ్రాన్ ఖాన్ తో వివాహం గురించి, 15 నెలల తర్వాత విడాకులు తీసుకోవడం గురించి రాసినట్లు తెలుస్తోంది.