సెక్స్ జీవితాలు: ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్యకు వసీం అక్రమ్ లీగల్ నోటీసు

Imran Khan’s ex-wife Reham Khan served legal notice
Highlights

పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహం ఖాన్ తాను రాయబోయే పుస్తకంలో కొందరి సెక్స్ జీవితాల గురించిన ప్రస్తావన సంచలనం సృష్టిస్తోంది. 

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహం ఖాన్ తాను రాయబోయే పుస్తకంలో కొందరి సెక్స్ జీవితాల గురించిన ప్రస్తావన సంచలనం సృష్టిస్తోంది. అందుకు గాను ఆమెకు నలుగురు వ్యక్తలు లీగల్ నోటీసులు ఇచ్చారు. లీగల్ నోటీసులు ఇచ్చిన క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ కూడా ఉన్నాడు. 

రేహం ఖాన్ తాను త్వరలో వెలువరించే పుస్తకంలోని విషయాలు ఇటీవల ఆన్ లైన్లో లీకయ్యాయి. దీనిపై భగ్గుమన్న వ్యక్తులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. 

రేహం మొదటి భర్త డాక్టర్ ఇజాజ్ రెహ్మాన్, క్రికెటర్ వసీం అక్రమ్, బ్రిటిష్ వ్యాపార వేత్త సయ్యద్ జుల్ఫీకర్ బుఖారీ, ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ తెహ్రీక్ -ఐన్సాఫ్ మీడియా సమన్వయకర్త అనిల ఖవాజా ఆమెకు లీగల్ నోటీసులు ఇచ్చారు. 

రేహం ఖాన్ తన పుస్తకంలో వివిధ సెలిబ్రిటీలతో తను ములాఖత్ ల గురించి, ఇమ్రాన్ ఖాన్ తో వివాహం గురించి, 15 నెలల తర్వాత విడాకులు తీసుకోవడం గురించి రాసినట్లు తెలుస్తోంది. 

loader