పాకిస్తాన్‌‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్థాన్‌ను ఒకటిగా అభివర్ణించారు.

పాకిస్తాన్‌‌కు అంతర్జాతీయంగా మరోసారి ఘోర అవమానం ఎదురైంది. పాకిస్తాన్‌‌పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్థాన్‌ను ఒకటిగా అభివర్ణించారు. శుక్రవారం డెమొక్రాటిక్ కాంగ్రెస్ ప్రచార కమిటీ రిసెప్షన్‌లో జో బైడెన్ మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశారు. ఈ మేరకు వైట్ హౌస్ ఒక ప్రకటన‌లో జో బైడెన్ కామెంట్స్‌ను ఉటంకించింది.

‘‘ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాలలో పాకిస్తాన్‌ను ఒకటిగా నేను భావిస్తున్నాను. పాకిస్తాన్ ఏ విధమైన సమన్వయం లేకుండా అణ్వాయుధాలు కలిగి ఉంది’’ అని బైడెన్ పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ వివాదం గురించి, అది ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేసిందనే అంశం గురించి మాట్లాడుతూ జో బైడెన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇతర దేశాలతో అమెరికా సంబంధాల గురించి కూడా ఆయన మాట్లాడారు.