పాకిస్తాన్ విచిత్రంగా మంత్రులు అందరూ ప్రమాణ స్వీకారానికి రెడీ అయ్యారు.. కానీ, ప్రమాణం చేయించే రాష్ట్రపతి మాత్రం అందుబాటులో లేకుండా పోయాడు. నూతన ప్రధానిగా షాబాజ్ షెరీఫ్ ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు నుంచే రాష్ట్రపతి తన ఆరోగ్యం నలతగా ఉన్నదని పేర్కొన్న సంగతి తెలిసిందే. 

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో విచిత్ర పరిణామం ఎదురైంది. నూతన ప్రధానమంత్రి షాబాజ్ షెరీఫ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చుక్కెదురైంది. అన్ని సక్రమంగా సాగితే.. మంగళవారం అంటే ఈ రోజు ప్రమాణ స్వీకారం తీసుకోవాల్సింది. ఈ ప్రమాణ స్వీకారం ఆ దేశ రాష్ట్రపతి ఆరిఫ్ అల్వీ కొత్త మంత్రులతో చేయించాలి. కానీ, ఆయన చెప్పాపెట్టాకుండా అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం వాయిదా పడింది.

పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ నుంచి 14 మంత్రులు, పీపీపీ నుంచి 11 మంది కొత్త మంత్రివర్గంలో చోటు లభించింది. పీఎంఎల్ఎన్ నేత మరియం ఔరంగజేబు ఇటీవలే మాట్లాడుతూ, కొత్త మంత్రివర్గాన్ని మంగళవారం ప్రకటిస్తామని తెలిపారు. ఇది చాలా దీర్ఘమైన ప్రక్రియగా సాగిందని, కొత్త మంత్రివర్గ కూర్పుపై మిత్రపక్షాలతో దీర్ఘ చర్చల అనంతరం నిర్ణయానికి వచ్చామని వివరించారు. కొత్త మంత్రివర్గంపై తుది నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే క్యాబినెట్ మంత్రులను ప్రకటిస్తామని వెల్లడించారు.

ఈ నెలలోనే పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రిగా షాబాజ్ షెరీఫ్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందే రాష్ట్రపతి ఆరిఫ్ అల్వీ అనారోగ్యానికి గురయ్యడు. ఆరోగ్యం నలతగా ఉన్నదని ఆయన పేర్కొన్నాడు. ఆ తర్వాత ఎలాంటి వివరణ ఇవ్వకుండానే సోమవారం నుంచి ఆయన సెలవులో వెళ్లాడు.

ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతా ప్రకారం, పాకిస్తాన్ రాష్ట్రపతి ఆరిఫ్ అల్వీని వైద్యులు పరీక్షించారు. ఆరిఫ్ అల్వీ తన ఆరోగ్యం నలతగా ఉన్నదని పేర్కొన్నాడు. ఫిజీషియన్ ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించాడు. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచనలు ఇచ్చాడు అని ఆ ట్వీట్ పేర్కొంది.

ఇలా ముందస్తు సమాచారం లేకుండా.. నూతన క్యాబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారానికి షెడ్యూల్ విడుదలైన తర్వాత.. ప్రమాణ స్వీకారం చేయించే రాష్ట్రపతి అందుబాటులో లేకుండా పోవడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చని చర్చిస్తున్నారు.

కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం మంగళవారం లేదా బుధవారం ఉండే అవకాశం ఉన్నదని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ ఖాన్ స‌ర్కారు ఓటమి పాలైంది. దీంతో ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వం కుప్ప‌కూలింది. ఈ క్రమంలో ప్ర‌తిప‌క్ష నేత‌లు నూత‌న ప్రధాని అభ్య‌ర్థిగా.. షెహ‌బాజ్ ష‌రీఫ్ పేరును ప్ర‌తిపాదించాయి. దీంతో పాకిస్తాన్ నూత‌న ప్ర‌ధాన మంత్రిగా షెహ‌బాజ్ ష‌రీఫ్ ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు సోమవారం ప్ర‌మాణం చేశారు. అనంత‌రం.. జాతీయ అసెంబ్లీ పిలుపునివ్వ‌గా.. అసెంబ్లీ స‌మావేశ‌మైంది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ సభ్యులు తమ రాజీనామాలను సమర్పించారు. 

 ఈ సంద‌ర్భంలో పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) ఎంఎన్ఎ ఫహీమ్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశానికి కొత్తగా ఎన్నికైన ప్రధాని షెహబాజ్ షరీఫ్.. 'అంతర్జాతీయ భికారీ' అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్రమంలో ఆయ‌న సెల్ఫీ వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో చేయ‌డంతో వైరల్‌గా మారింది. (బిచ్చగాడు). ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ సభ్యులు తమ రాజీనామాలను సమర్పించినప్పుడు, ప్రతిపక్ష నాయకుడు షెహబాజ్ షరీఫ్ దేశం యొక్క తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి మార్గం చూపుతున్నప్పుడు స్వీయ-రికార్డ్ వీడియో నేషనల్ అసెంబ్లీలో బంధించబడింది.