పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ కి కరోనా.. భయంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్

రెండు రోజుల క్రితం ఇమ్రాన్‌ కలవడం దీనికి కారణం. దీంతో ముందస్తు జాగ్రత్తంగా ప్రధానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్పీకర్‌ ఎవరెవరిని కలిశారు అనేది గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. ఆయనకు దగ్గరగా మెలిగిన వారిని గుర్తించి క్వారెంటైన్‌కు తరలిస్తున్నారు.
 

Pakistan National Assembly Speaker tests COVID 19 positive

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి కరోనా భయం పట్టుకుంది. పాక్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖురేషీ ఇటీవల కరోనా వైరస్ బారిన పడ్డారు. గురువారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో ఖురేషీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను అధికారులు క్వారెంటైన్‌కు తరలించారు.

ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి కూడా కరోనా సోకుతుందనే భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే...కరోనా పాజిటివ్‌గా తేలిన అసద్‌.. రెండు రోజుల క్రితం ఇమ్రాన్‌ కలవడం దీనికి కారణం. దీంతో ముందస్తు జాగ్రత్తంగా ప్రధానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్పీకర్‌ ఎవరెవరిని కలిశారు అనేది గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది. ఆయనకు దగ్గరగా మెలిగిన వారిని గుర్తించి క్వారెంటైన్‌కు తరలిస్తున్నారు.

కాగా ఇమ్రాన్‌కు ఇదివరకే ఓసారి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ అని తేలింది. ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు పాకిస్తాన్‌లో 16,353  కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. పవిత్ర రంజాన్‌ మాసం కావడంతో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios