పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనను తాను గాడిదతో పోల్చుకున్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన తాను యూకేలో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ ఈ పోలిక తెచ్చాడు. ఆ వీడియోను హసన్ జైదీ అనే యూజర్ ట్వీట్ చేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తనపై తాను షాకింగ్ కామెంట్ చేసుకున్నాడు. తనను తాను గాడిదతో పోల్చుకున్న అభాసుపాలయ్యాడు. ఓ పోడ్‌కాస్ట్ వీడియోల ఆయన తనను తాను గాడిదతో పోల్చుకున్నాడు. పాకిస్తాన్ మాజీ పీఎం ఇమ్రాన్ ఖాన్ కంటెంట్ క్రియేటర్లు జునైద్ అక్రమ్, ముజమ్మిల్ హసన్, తల్హాతో ఓ పోడ్‌కాస్ట్‌లో కనిపించాడు. అందులో ఇమ్రాన్ ఖాన్ తాను యూకేలో ఉన్నప్పటి రోజుల గురించి మాట్లాడాడు.
తనకు యూకేలో అన్ని రకాల వసతులు, అన్ని సదుపాయాలతో జీవించానని ఆ వీడియోలో ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు. కానీ, యూకేలో ఉన్న రోజుల్లో తనకు అది ఎన్నడూ తన సొంతింటి అనుభూతిని ఇవ్వలేదని వివరించాడు. యూకేను తన స్వగృహంగా స్వీకరించలేకపోయాడని పేర్కొన్నాడు. తాను పాకిస్తానీని అని చెప్పాడు. తాను అక్కడ ఏం చేసినా ఆంగ్లేయుడిని మాత్రం కాలేను కదా అని వివరించాడు. ఎలాగంటే.. ఒక గాడిదపై నల్లటి చారలు గీస్తే.. జీబ్రా కాలేదు కదా అని పేర్కొన్నాడు. గాడిద ఎప్పటికి గాడిదగానే ఉంటుందని అంటూ చెప్పుకుపోయాడు. ఈ క్రమంలో ఆయన తనను తాను ఒక గాడిదతో పోల్చుకున్న విషయాన్ని కూడా కనీసం అవగాహన చేసుకోలేకపోయాడు.
హసన్ జైదీ ఆ పోడ్‌కాస్ట్‌లోని ఓ చిన్ని స్నిప్పెట్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. వితౌట్ కామెంట్ అంటూ ఆ వీడియో స్నిప్పెట్‌ను ట్వీట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పోస్టుకు నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. అనేక జోకులు, మీమ్స్ పేలాయి.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయన పాకిస్థాన్ ప్రధాని గా ఉన్నప్పుడు.. బహుమతిగా పొందిన ఓ బంగారు గొలుసు ప్రభుత్వ ఖజానా నుంచి మాయమైందని అధికారులు గుర్తించారు. ఈ బంగారు గొలుసు విలువ దాదాపు రూ. 18 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ బంగారు గొలుసును తాను అధికారంలో ఉన్నప్పుడు.. ఓ ప్రైవేటు వ్యాపారికి అమ్మివేసినట్టు.. స్థానిక మీడియా సంస్థలలో పలు ఆరోపణలు వచ్చాయి.
ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో.. ఆయన బహుమతిగా లభించిన ఖరీదైన బంగారు గొలుసును తోషా-ఖానా (స్టేట్ గిఫ్ట్ రిపోజిటరీ)కి పంపలేదని అధికారులు గుర్తించారు. దీన్ని ఆయన అసిస్టెంట్ జుల్పికర్ బుఖారీ సహయంతో లాహోర్ లోని నగల వ్యాపారికి 18 కోట్లకు విక్రయించారని పలు వార్త కథనాలు వెలువడుతున్నాయి. అయితే, ఈ విషయాన్ని పాకిస్థాన్ అత్యున్నత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీరియస్ గా తీసుకుంది. ఇమ్రాన్ పై విచారణ చేపట్టింది. ప్రస్తుతం పాక్ లో ఘటన కలకలం సృష్టిస్తోంది.
