Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో పాకిస్థాన్ ఆర్థిక మంత్రికి చేదు అనుభ‌వం.. చోర్, అబ‌ద్దాల కోరు అంటూ నినాదాలు

US Airport: ట్విట్టర్‌లో వైరల్ అయిన వీడియోలో.. యూఎస్ లోని పాకిస్తాన్ రాయబారి మసూద్ ఖాన్, ఇతర అధికారులతో కలిసి అమెరికాలో విమానాశ్ర‌యానికి చేరుకున్న పాకిస్థాన్ అర్థిక మంత్రి ఇషాక్ దార్ ను ప‌లువురు అడ్డుకున్నారు. చోర్ చోర్ (దొంగ దొంగ‌).. ల‌య‌ర్ (అబ‌ద్దాల కోరు) అంటూ ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. 
 

Pakistan Finance Minister Ishaq Dar Heckled At US Airport, Called "Liar, Chor"
Author
First Published Oct 15, 2022, 3:08 AM IST

Pakistan Finance Minister Ishaq Dar: పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాన్ దార్ కు అమెరికాలోని విమానాశ్ర‌యంలో చేదు అనుభ‌వం ఎదురైంది. ఆయ‌న‌ను అడ్డుకునీ, ప‌లువురు దూషించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. ట్విట్టర్‌లో వైరల్ అయిన వీడియోలో.. అమెరికాలోని పాకిస్తాన్ రాయబారి మసూద్ ఖాన్, ఇతర అధికారులతో కలిసి అమెరికాలోని వాషింగ్టన్  విమానాశ్ర‌యానికి చేరుకున్న పాకిస్థాన్ అర్థిక మంత్రి ఇషాక్ దార్ ను ప‌లువురు అడ్డుకున్నారు. చోర్ చోర్ (దొంగ దొంగ‌).. ల‌య‌ర్ (అబ‌ద్దాల కోరు) అంటూ ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. ప్ర‌స్తుతం పాకిస్థాన్ ఆర్థికంగా అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటోంది. ఇటీవ‌ల సంభ‌వించిన వ‌ర‌ద‌లు ఆ దేశంలో పెను విషాదాన్ని నింపాయి. ఆర్థికంగా కొలుకోలేని విధంగా దెబ్బ‌కొట్టాయి. క్ర‌మంలోనే అంత‌ర్జాతీయ సాయం కోసం పాకిస్థాన్ ఎదురుచూస్తోంది. రుణులు తీసుకోవ‌డానికి ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో పాటు ప‌లు ధ‌నిక దేశాల‌ను పాకిస్థాన్ ఆశ్ర‌యిస్తోంది.  ఆర్థికంగా అనేక స‌మ‌స్య‌లు, నగదు కొరత, వరద ప్రభావిత దేశానికి అవసరమైన సహాయం కోసం పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అంతర్జాతీయ రుణ సంస్థలతో సమావేశాలకు హాజరయ్యేందుకు వాషింగ్టన్ వ‌చ్చారు. ఆయ‌న అక్క‌డి విమానాశ్ర‌యానికి రాగానే.. ప‌లువురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను అడ్డుకున్నారు. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. 

పాకిస్థాన్ ఆర్థిక మంత్రి ఇషాన్ దార్ కు సంబంధించిన ఆ వీడియోలో.. విమానాశ్ర‌యంలో ఆయ‌న‌ను ప‌లువురు అడ్డుకున్నారు. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. చోర్ చోర్.. ల‌య‌ర్ ల‌య‌ర్ అంటూ ఆయ‌నపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక వ్య‌క్తి ఆ వీడియోలో.. వీరు అబ‌ద్దాల కోరు.. మీరు ఒక చోర్ (దొంగ‌) అంటూ ఆర‌వ‌డం స్ప‌ష్టంగా విన‌ప‌డుతోంది. 

కాగా, 72 ఏండ్ల ఇషాన్ దార్దాఇటీవల తన పూర్వీకుడైన మిఫ్తా ఇస్మాయిల్ నుంచి పాకిస్తాన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వార్షిక సమావేశాలకు హాజరయ్యేందుకు ఆయన అమెరికాలో ఉన్నారు. వినాశకరమైన వరదలు ఆ దేశాన్ని తాకిన తరువాత పాకిస్తాన్ అంతర్జాతీయ రుణదాతల నుంచి సాయం కోరుతోంది. త‌మ రుణాల విష‌యంలో ష‌ర‌తుల‌ను స‌వ‌రించాల‌ని కోరుతోంది.  కాగా, ఇటీవ‌ల పాకిస్థాన్ లో వ‌ర‌ద‌లు బీభ‌త్సం సృష్టించాయి. వినాశకరమైన వరదల వల్ల సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 1,700ల‌కు పైగా ఉందని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇది 33 మిలియన్లకు పైగా ప్రజలను ప్ర‌భావితం చేసింది. దాదాపు 40 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక నష్టాలను కలిగించింది. ఇప్ప‌టికే ఆర్థిక ఇబ్బందులను వ‌ర‌ద‌లు మ‌రింత దారుణంగా మార్చాయి. పాకిస్థాన్ త‌న రుణ బాధ్యతలను తీర్చలేకపోవచ్చుననే భయాలను సైతం రేకెత్తించింది.

పాకిస్తాన్ మంత్రులు తమ విదేశీ పర్యటనలలోనే కాకుండా దేశంలోని బ‌హిరంగా ప్రాంతాల్లో చేదు అనుభ‌వం, ఎగ‌తాళి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొవడం ఇదే మొద‌టిసారి కాదు. గత నెలలో సమాచార శాఖ మంత్రి మర్రియుమ్ ఔరంగజేబును లండన్ లోని ఓ కాఫీ షాప్ లో ఆయ‌నపై దాడి చేశారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ మద్దతుదారులు ప్రణాళిక, అభివృద్ధి శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ను ఓ రెస్టారెంట్లో వేధించారు. సౌదీ అరేబియాలో మూడు రోజుల పర్యటన సందర్భంగా మదీనాలోని మసీదు-ఇ-నబ్వి వద్ద ఏప్రిల్ లో పాకిస్తాన్ యాత్రికుల బృందం ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆయన పరివారంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. వారికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. కాగా, పాకిస్తాన్ రాజకీయ నాయకులు, ఇతర మత ప్రముఖులు తాజా సంఘటనను ఖండించారు. మ‌రికొంత మంది ఇది ఖాన్ మ‌ద్ద‌తుదారుల ప‌నేనంటూ ఆయ‌న పై ఆరోప‌ణ‌లు గుప్పించారు.

Follow Us:
Download App:
  • android
  • ios