Asianet News TeluguAsianet News Telugu

Imran Khan: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు.. ఇంతకీ సైఫర్ కేసు ఏమిటీ?

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి కూడా సైఫర్ కేసులో ఈ శిక్ష వేసింది.
 

pakistan ex president imran khan handed 10 years in prison in cipher case, what is cipher case kms
Author
First Published Jan 30, 2024, 1:19 PM IST | Last Updated Jan 30, 2024, 1:40 PM IST

Pakistan: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌కు ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇమ్రాన్ ఖాన్‌తోపాటు మాజీ విదేశాంగ మంత్రి, పీటీఐ వైస్ చైర్మన్ షా మహమూద్‌ ఖురేషీలకు సైఫర్ కేసులో పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు ఒక రహస్య దౌత్యపరమైన లేఖకు సంబంధించింది. 2022లో పాకిస్తాన్ అధ్యక్ష పదవీచ్యుతుడైన తర్వాత ఇమ్రాన్ ఖాన్ ఓ ర్యాలీలో ఓ రహస్య లేఖను ప్రదర్శించారు. అదే ర్యాలీలో పాకిస్తాన్ ప్రభుత్వం, అమెరికాపైనా సంచలన ఆరోపణలు చేశారు. 

పాకిస్తాన్ అధ్యక్షుడిగా తనను తొలగించాలని అమెరికా కోరుకుందని, తనను తొలగించడానికి అమెరికా కుట్ర చేసిందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. అందుకు ఇదే ఆధారం అని రహస్య లేఖను చూపించారు. అమెరికా ఆదేశాలకు అనుగుణంగా పాకిస్తాన్ మిలిటరీ ప్రభుత్వం నడుచుకుందని ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసునే సైఫర్ కేసు అంటారు.

Also Read: Maldives: ఇండియాను వ్యతిరేకిస్తే అంతే సంగతులు!.. మాల్దీవ్స్ అధ్యక్షుడిపై అభిశంసనకు విపక్షం నిర్ణయం

ఈ కేసు విచారించడానికి అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద ఓ ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఆ కోర్టు కేసు విచారించింది. తాజాగా, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి పదేళ్ల జైలు శిక్ష విధించింది. స్పెషల్ కోర్టు న్యాయమూర్తి అబుల్ హస్నత్ జుల్కార్నెయిన్ ఈ తీర్పును వెలువరించారు.

ఈ విచారణలో ఇమ్రాన్ ఖాన్, షా మహమూద్ ఖురేషీలకు పీపీసీలోని సెక్షన్ 342 కింద ప్రశ్నావళిని అందించారు. ఇమ్రాన్ ఖాన్ తన స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆ సైఫర్ ఎక్కడ ఉన్నదని న్యాయమూర్తి అడిగారు. దీనికి ఇమ్రాన్ ఖాన్ సమాధానం ఇస్తూ.. ‘నా స్టేట్‌మెంట్‌లో సమాధానం ఇచ్చాను. అది ఎక్కడ ఉన్నదో నాకు తెలియదు. సైఫర్ నా ఆఫీసులో ఉండేది’ అని వివరించారు.

ఫిబ్రవరి 8వ తేదీన పాకిస్తాన్ జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్న తరుణంలో ఈ తీర్పు వెలువడింది. ప్రభుత్వం అన్ని విధాలుగా దాడి చేస్తుండగా..  ఆ ఎన్నికల్లో ఎలక్టోరల్ సింబల్ లేకుండానే పీటీఐ పోటీ చేస్తున్నది.

Also Read: Prashant Kishor: నితీశ్‌కు లాస్ట్ ఇన్నింగ్, లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్విప్: ప్రశాంత్ కిశోర్

ఇమ్రాన్ ఖాన్ దోషిగా తేలిన రెండో కేసు ఇది. గతంలో తోషిఖానా కేసులో ఆగస్టు 5వ తేదీన దోషిగా తేలారు. అందులో మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఆ తర్వాత ఇస్లామాబాద్ హైకోర్టు ఆయనకు పైడిన శిక్షను సస్పెండ్ చేసింది. అనంతరం, తన శిక్షను రద్దు చేయాలని దాఖలు చేసిన ఇమ్రాన్ ఖాన్ పిటిషన్‌ను డివిజన్ బెంచ్ తిరస్కరించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios