Asianet News TeluguAsianet News Telugu

పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ శిక్ష రద్దు.. జైలు నుంచి విడుదల

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఊరట లభించింది.. అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్‌ శిక్షను రద్దు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది.

pakistan ex PM nawaz sharif released from prison
Author
Islamabad, First Published Sep 20, 2018, 7:56 AM IST

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు ఊరట లభించింది.. అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్‌ శిక్షను రద్దు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పు వెలువరించింది. అవెన్‌ఫీల్డ్ కేసులో షరీఫ్, ఆయన కూతురు మరియం, అల్లుడు మహ్మద్ సఫ్దార్‌ల జైలు శిక్షను నిలిపివేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో నిన్న రాత్రి వీరి ముగ్గురిని రావల్పిండి జైలు నుంచి విడుదల చేశారు.. అక్కడి ఎయిర్ బేస్ నుంచి ప్రత్యేక విమానంలో లాహోర్‌కు పటిష్టమైన భద్రత మధ్య తరలించారు.. విడుదల ముందు సన్నిహితులతో ‘‘ నేనేం తప్పుచేయలేదని నా అంతరాత్మకు తెలుసు.. ఏది సత్యమో అల్లాకు తెలుసు’’ అన్నట్లుగా పాక్ మీడియా కథనాలు వెలువరించింది.

అవినీతి సంపాదనతో  లండన్‌లోని అవెన్‌ఫీల్డ్ ప్రాంతంలో ఖరీదైన బంగ్లాలు కొన్నారన్న అభియోగంపై తనను, కూతురిని, అల్లుడిని జైలులో పెట్టడాన్ని సవాల్ చేస్తూ.. షరీఫ్ ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios