Asianet News TeluguAsianet News Telugu

"నిరంకుశ పాలన" స్థాయికి దిగజారిన పాకిస్తాన్ : రిపోర్ట్

పాకిస్తాన్ లో ఎన్నికల ప్రక్రియలో జోక్యం, ప్రభుత్వ పనిచేయకపోవడం, న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడం లాంటివి అక్కడ ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 

Pakistan Degenerates into 'authoritarian regime' : Report - bsb
Author
First Published Feb 17, 2024, 1:31 PM IST

పాకిస్థాన్ : ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (EIU) డెమోక్రసీ ఇండెక్స్ 2023 నివేదిక ప్రకారం, "ఆస్ట్రేలియా, ఆసియా"గా వర్గీకరించబడిన ప్రాంతంలోని ఏ దేశానికైనా అత్యంత క్షీణతను నమోదు చేస్తూ, "అధికార పాలన"కి డౌన్‌గ్రేడ్ చేయబడిన ఏకైక ఆసియా దేశంగా పాకిస్థాన్ అవతరించింది.

ఇది "హైబ్రిడ్ పాలన" నుండి "అధికార పాలన"గా తిరోగమనం చెందింది అని నివేదికను ఉటంకిస్తూ జియో న్యూస్ నివేదించింది. ఈఐయూ ప్రజాస్వామ్య సూచిక 165 స్వతంత్ర దేశాలు, రెండు భూభాగాలలో ప్రజాస్వామ్య స్థితి ఎలా ఉందో తెలుపుతుంది. 

ఇండెక్స్‌లో చేర్చబడిన ప్రాంతంలోని 28 దేశాలలో, 15 దేశాల స్కోర్‌లో క్షీణత నమోదయ్యింది. ఎనిమిది దేశాల్లో మాత్రమే మెరుగుదల నమోదయ్యింది. ముఖ్యంగా, ఈఐయూ డెమోక్రసీ ఇండెక్స్‌లో పాకిస్తాన్ స్కోర్ 0.88 నుండి 3.25కి పడిపోయింది.

ఇనుప కడ్డీల మధ్య చిక్కుకున్న హంస: కాపాడిన వ్యక్తి వీడియో వైరల్

ఫలితంగా గ్లోబల్ ర్యాంకింగ్ టేబుల్‌లో 11 స్థానాలు పడిపోయి, 118వ స్థానానికి చేరుకుందని జియో న్యూస్ తెలిపింది. దీంతోపాటు, ఎన్నికల ప్రక్రియలో జోక్యం, ప్రభుత్వ పనిచేయకపోవడం, పాకిస్తాన్‌లో న్యాయవ్యవస్థ స్వతంత్రం తగ్గించబడడం లాంటి వాటి కారణంగా ఇది జరిగిందని నివేదికలో హైలైట్ చేసింది.

2008 నుండి, ప్రజాస్వామ్య సూచికలో దేశం స్కోరు 4 కంటే కొంచెం ఎక్కువగానే ఉంది. అయితే, 2023లో మొదటిసారిగా, ప్రధానంగా పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N), పాకిస్తాన్ పీపుల్స్‌పార్టీ (PPP), జమైత్ ఉలేమా-ఎ-ఇస్లాం ఫజల్ (JUI-F)
తో కూడిన సంకీర్ణ ప్రభుత్వంలో దాని స్కోరు 3.25కి పడిపోయింది. 

ప్రజాస్వామ్య సూచీలో పాకిస్థాన్ స్కోరు 2023 స్కోరు 2006లో 3.92గా ఉంది. అప్పుడు దేశాన్ని సైనిక పాలకుడు జనరల్ (రిటైర్డ్) పర్వేజ్ ముషారఫ్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అప్పటి కంటే కంటే పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉందని జియో న్యూస్ నివేదించింది.

దీనిమీద పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ డెవలప్‌మెంట్ అండ్ ట్రాన్స్‌పరెన్సీ (పిల్దాట్) అహ్మద్ బిలాల్ మెహబూబ్ మాట్లాడుతూ, "ఇది చాలా నిరాశాజనక పరిణామం, ఎందుకంటే పాకిస్తాన్ 2017 నుండి ప్రజాస్వామ్య సూచీలో అత్యల్ప స్కోరు సాధించింది. మా వర్గం కూడా ఈ నిరంకుశ పాలనలో హైబ్రిడ్ పాలన నుండి డౌన్‌గ్రేడ్ చేయబడింది" అన్నారు. "ఈ పరిస్థితిపై తీవ్రమైన ఆత్మ పరిశీలన చేపట్టాలని" అందరు స్టేక్ హోల్డర్స్ ను అభ్యర్తించారు.

వాషింగ్టన్‌లోని వుడ్రో విల్సన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్కాలర్స్‌కు చెందిన దక్షిణాసియా నిపుణుడు మైఖేల్ కుగెల్‌మాన్ మాట్లాడుతూ, పాకిస్తాన్ అంతకుముందు 15 సంవత్సరాల అధికారిక పౌర పాలన, కొన్ని వికేంద్రీకరణ సంస్కరణలతో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేశారు. కానీ ఆ తరువాతి సంవత్సరాల్లో దేశం తిరోగమనం చెందడం దురదృష్టకరమని అన్నారు. ఇది అధికారిక సైనిక పాలనలో ఉన్న కాలంలో కంటే తక్కువ ప్రజాస్వామ్యయుతంగా ఉందని అన్నారు. 

"ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే.. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో చెప్పలేకపోవడం’’ అన్నారాయన. బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌ స్కాలర్ మదిహా అఫ్జల్ మాట్లాడుతూ... పాకిస్తాన్ లో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా... ఈఐయూలో పాకిస్తాన్ హైబ్రిడ్ పాలన నుండి నిరంకుశ పాలనకు దిగజారడంలో ఆశ్చర్యం లేదని అన్నారు. "పాకిస్థాన్ ప్రజాస్వామ్య తిరోగమనం, నిరంకుశ పరిణామాన్ని ప్రపంచం గమనిస్తోందనడానికి ఇది ఒక సంకేతంగా ఉంది’’ అని ఆమె అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios