Pakistan: రామ మందిరం ఓపెనింగ్ పై పాకిస్తాన్ ఫైర్.. ఏమన్నదంటే?
రామ మందిరం ఓపెనింగ్ పై పాకిస్తాన్ మండిపడింది. బాబ్రీ మసీదు కూల్చి అదే చోట రామ మందిరాన్ని నిర్మించడం, అందులో ప్రాణ ప్రతిష్ట నిర్వహించడాన్ని పాకిస్తాన్ ఖండించింది. ఇది ఇండియా ప్రజాస్వామ్యానికి మచ్చ అని పేర్కొంది.
Pakistan: అయోధ్యలో రామ మందిరాన్ని ఈ రోజు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. అయోధ్య రామ మందిరం నిర్మాణాన్ని, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఖండిస్తూ ఓ ప్రకటన చేసింది. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసి అదే ప్లేస్‌లో రామ మందిరాన్ని నిర్మించడం, అందులో ప్రాణ ప్రతిష్ట చేయడాన్ని పాకిస్తాన్ ఖండిస్తున్నదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో పేర్కొంది.
‘మసీదు కూల్చి మందిరాన్ని నిర్మించడం భారత దేశ ప్రజాస్వామ్యంపై ఒక నల్లటి మచ్చగా మిగులుతుంది. వారణాసిల జ్ఞానవాపి మసీదు, మాథురలో షా ఈద్గా మసీదు వంటి అనేక మసీదులను కూడా ఇలాగే ధ్వంసం చేసే పనులు జరుగుతున్నాయి’ అని పాకిస్తాన్ పేర్కొంది.
‘గత 31 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలు, నేటి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం వరకు రావడాన్ని చూస్తే ఇండియాలో మెజారిటేరియనిజం పెరగడాన్ని సూచిస్తున్నది. ఇది భారత ముస్లింల రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం వేస్తాయి.
Also Read : అయోధ్య రామ మందిరం కాంప్లెక్స్‌లో భక్తుడికి గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
మత మైనార్టీలను సురక్షణ, భద్రతను భారత ప్రభుత్వం కాపాడాలని పాకిస్తాన్ ఈ సందర్బంగా కోరింది. అందులోనూ ముఖ్యంగా ముస్లింలు, ముస్లింల మత ప్రాంతాలను కాపాడాలని విజ్ఞప్తి చేసింది.