న్యూఢిల్లీ: పాకిస్తాన్ తమ చెరలో అభినందన్‌ అనే ఇండియన్ ఆర్మీకి చెందిన అభినందన్ తమ బందీగా ఉన్నాడని పాక్ ప్రకటించింది. ఈ మేరకు అభినందన్ తమ ఆధీనంలో ఉన్నట్టుగా ఓ వీడియోను పాకిస్తాన్ బుధవారం నాడు విడుదల చేసింది.

అయితే అభినందన్ పాక్ బందీగా ఉన్న విషయాన్ని భారత్ మాత్రం ఇంకా ధృవీకరించలేదు.ఇదిలా  ఉంటే  ఈ వీడియోను విడుదల చేసిన కొద్దిసేపటికే పాక్ ఆ వీడియోను డిలీట్ చేసింది.

పాకిస్తాన్‌ ఇవాళ బారత్‌కు చెందిన రెండు విమానాలను కూల్చేసినట్టుగా ప్రకటించింది. ఇందులో ఇద్దరిని తమ ఆధీనంలో ఉన్నారని చెబుతోంది.తమ ఆధీనంలో ఎయిర్‌ఫోర్స్  వింగ్ కమాండర్‌‌గా పనిచేసే అభినందన్ ఉన్నాడని ప్రకటించింది. 

అభినందన్ బంధీగా ఉన్న వీడియోను పాక్ ఇవాళ విడుదల చేసింది. మరో పైలెట్ తీవ్రంగా గాయపడ్డాడని పాక్ ప్రకటించింది. అతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నట్టు పాక్ తెలిపింది.

పాకిస్తాన్ ఆర్మీ కి చెందిన అధికార ప్రతినిధి జనరల్ ఆసిఫ్ గఫూర్ మీడియా సమావేశం తర్వాత  ఈ వీడియోను విడుదల చేశారు.అయితే  అభినందన్ పాక్ బంధీగా ఉన్న విషయాన్ని భారత్ ఇంకా ధృవీకరించలేదు.

ఇదిలా ఉంటే అభినందన్ పేరుతో ఉన్న వీడియోను  షేర్ చేసింది. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే ఈ వీడియోను పాక్ డిలీట్ చేసింది. అయితే పాక్ రెండు విమానాలను కూల్చలేదని ఇప్పటికే భారత్ ప్రకటించింది.దీంతో పైలెట్లు కూడ పాక్ ఆధీనంలో లేరని భారత అధికారులు అభిప్రాయపడుతున్నారు. పాక్ తాను విడుదల చేసిన వీడియో డిలీట్ చేయడంతో పాక్ తీరు బట్టబయలైందని  భారత అధికారులు చెబుతున్నారు.