పాకిస్తాన్ యూనివర్సిటీల్లో హోలీ వేడుకలు నిషేధిస్తూ ఆ దేశ ఉన్నత విద్య కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇస్లామాబాద్‌లోని ఖాయిదీ ఆజామ్ యూనివర్సిటీ జూన్ 12వ తేదీన విద్యార్థులు హోలీ వేడుకలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయిన తర్వాత పై ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి వేడుకలు దేశ గుర్తింపును, ఇస్లామిక్ ఐడెంటిటీని మసకబారుస్తుందని పేర్కొంది. 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఉన్నత విద్యా కమిషన్ (హెచ్ఈసీ) అన్ని విశ్వవిద్యాలయాల్లో హోలీ వేడుకులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఖాయిది ఆజామ్ యూనివర్సిటీలో విద్యార్థులు జూన్ 12న హుషారుగా రంగులు పూసుకుంటూ హోలీ వేడుకలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వచ్చాయి. ఇలాంటి వేడుకలు జరుపుకోవడం నిషేధం అంటూ స్పష్టం చేసింది. వీటికి దూరంగా సామాజిక, సాంస్కృతిక విలువలు కాపాడుకోవాలని వివరించింది.

ఇలాంటి కార్యకలాపాలు దేశ సామాజిక సాంస్కృతిక విలువలకు భిన్నమైన సంకేతాలను ఇస్తుందని, దేశ ఇస్లామిక్ ఐడెంటిటీని మసకబారుస్తుందని ఆ నోటీసులో హెచ్ఈసీ పేర్కొంది. ‘భిన్న సంస్కృతులు, మతాలు, తెగలు ఒక వైవిధ్యమైన సమాజాన్ని ఏర్పాటు చేసి అన్ని మతాలను, జాతులను గౌరవించేలా చేస్తాయనే వాస్తవాన్ని ఎవరూ కాదనరు. అయినా, దీనికి ఓ హద్దు ఉండాలి. విద్యార్థులు తమను ఎవరు.. ఎవరి అవసరాల కొరకు ప్రభావితం చేస్తున్నారో? ఇలా పురికొల్పుతున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది’ అని ఆ నోటీసులు పేర్కొన్నాయి.

Scroll to load tweet…

ఖాయిదీ ఆజామ్ వర్సిటీలోని హోలీ వేడుకులను పరోక్షంగా ఉటంకిస్తూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిన ఓ యూనివర్సిటీ వేదికగా ఇటీవల జరిగిన ఓ కార్యక్రమం దేశ ముఖ చిత్రాన్ని ప్రభావితం చేసేలా ఉన్నదని హెచ్ఈసీ పేర్కొంది. కాబట్టి, ఇలాంటి కార్యక్రమాలకు ఉన్నత విద్యా సంస్థలు దూరంగా ఉండాలని సూచించింది. ఇలాంటి కార్యక్రమాలు దేశ గుర్తింపు, దేశ సామాజిక విలువలను దెబ్బ తీస్తాయని వివరించింది. 

Also Read: AI Chatbot: భార్యను చీట్ చేసి ఏఐ చాట్‌బోట్‌తో ప్రేమాయణం.. ఇదే మా దాంపత్యాన్ని నిలిపిందన్న భర్త

ఈ నెలలోనే ఇస్లామాబాద్‌లోని ఖాయిదీ ఆజామ్ యూనివర్సిటీ హోలీ వేడుకలు చేసుకుంది. ఈ వేడుకల కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.