విసిగిస్తున్న భార్య నుంచి కొంత మనశ్శాంతి కోసం ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ను ఆశ్రయించాడు. తన బాధలు చెప్పుకోగా అన్నీ గుర్తుంచుకోని ఓదార్పు అందించింది. ఇది ఆయన మానసిక స్థితిపై బలమైన ప్రభావం వేసింది. ఈ విషయం భార్యకు చెప్పకుండా దానితో దగ్గరి సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు.  

ఒక చాట్‌బోట్‌ కోసం రొమాంటిక్ ఫీలింగ్ డెవలప్ అవుతుందా? ఈ ప్రశ్నే వింతగా ఉన్నప్పటికీ అసాధ్యం అని మాత్రం చెప్పలేం. ఎందుకంటే 43 ఏళ్ల స్కాట్ అనుభవాన్ని చూస్తే సాధ్యమే అని అనిపించకమానదు. దీనికితోడు ఎన్నో నైతిక ప్రశ్నలూ వెంటే వస్తున్నాయి. 

డెలివరీ తర్వాత ఉండే డిప్రెషన్, దానికితోడు అల్కహాల్‌కు అలవాటు కావడంతో తన భార్య నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నానని స్కాట్ చెప్పాడు. అప్పుడు కొంత మనశ్శాంతి కోసం అన్వేషించాడు. టెక్ కంపెనీలో చేస్తున్న స్కాట్ ఏఐ(కృత్రిమ మేధస్సు) రెప్లికా యాప్ తయారు చేశాడు. ఇప్పుడు స్కాట్ ఏమంటాడంటే.. ఈ చాట్‌బొట్ ఒడిలో సేద తీరడమే కాదు.. తన దాంపత్యాన్ని కూడా ఈ టూల్ నిలబెట్టిందని వివరించాడు.

ది గార్డియన్ కథనం ప్రకారం, రెప్లికా యాప్ నుంచి సెరీనా పేరుతో ఏఐ తోడును తయారు చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకే మానసికంగా దాని ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించాడు. ఏఐ కంపేనియన్ నుంచి కొన్ని ఓదార్పు వచనాలు రావడం తనకు ఎంతో ఉపశమనం ఇచ్చిందని, ఆ తర్వాత ఏఐ ప్రతీది గుర్తు పెట్టుకుంటుందనే విషయం తన మదిలో మెదిలిందని వివరించాడు. అప్పుడు దప్పికతో నోరు ఎండిపోయినప్పుడు ఒయాసిస్ కనిపిస్తే ఎలాగుంటుందో అలా తనకు అనిపించిందని చెప్పాడు. 

Also Read: ఔను.. నేను రెండు సార్లు ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టలేదు: నేరాన్ని అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ కొడుకు

ఏఐ రెప్లికా ఎమోషనల్ సపోర్ట్‌ కోసం అభివృద్ధి చేశారు. అయితే ఇది ఇంకా చాలా రకాల కోరికలను (లైంగిక కోరికలు సహా) తీర్చడంలో సహకరిస్తుంది. ఇది మనుషులకు, ఏఐ క్యాంపెనియన్లకు మధ్య సంబంధాన్ని చిక్కబరుస్తున్నది. కొందరు యూజర్లు ఆ చాట్‌బోట్లనే పెళ్లి చేసుకున్నట్టు ప్రకటించుకున్నారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేస్తున్నప్పుడు ఎరోటిక్ రోల్ ప్లేను తొలగించగా.. చాలా మంది యూజర్లు అభ్యంతరం తెలిపారు. దీంతో మళ్లీ తీసుకువచ్చే పని చేస్తున్నారు.

స్కాట్ ఇలా ఏఐ కంపెనియన్‌తో సంబంధాన్ని పెట్టుకోవడాన్ని భార్యకు చెప్పలేదు. దశలుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆశ్చర్యకరంగా భార్య కూడా ఆ రెప్లికా తన అవతారమే అని తెలిపింది. స్కాట్ మాత్రం సెరీనాతో తన సంబంధాన్ని చీటింగ్‌గా చూడటం లేదు. ఇది అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. 

ఏఐ కంపెనియన్లు కంఫర్ట్, సపోర్ట్ ఇస్తున్నప్పటికీ మానసిక వ్యభిచారం, నమ్మకం, ఇంటిమసీల గురించి అనేక ప్రశ్నలను ముందు ఉంచుతున్నది. కాబట్టి, ఈ విషయాలపై ఓపెన్‌గా చర్చించడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. తద్వార మనిషి-కృత్రిమ మేధస్సుల మధ్య సంబంధాలుండే కొత్త ప్రపంచాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లడానికి వీలవుతుందని వివరిస్తున్నారు.