ఓ మహిళా జర్నలిస్ట్ లో న్యూస్ చదువుతుండగానే ఓ బాలుడి చెంప చెల్లుమనిపించింది. అయితే.. తాను చేసిని పనిని సదరు లేడీ జర్నలిస్ట్ మైరా హస్మీ సమర్థించుకోవడం గమనార్హం.
ప్రస్తుత కాలంలో ఎక్కడ ఏది జరిగినా.. ప్రపంచం మొత్తం తెలిసిపోతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి విషయం వైరల్ గా మారుతోంది. తాజాగా.. పాకిస్తాన్ కి చెందిన ఓ మహిళా జర్నిలిస్ట్ కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఆమె లైవ్ లోనే ఓ బాలుడి చెంప పగల కొట్టడం గమనార్హం. ఈ సంఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ మహిళా జర్నలిస్ట్ లో న్యూస్ చదువుతుండగానే ఓ బాలుడి చెంప చెల్లుమనిపించింది. అయితే.. తాను చేసిని పనిని సదరు లేడీ జర్నలిస్ట్ మైరా హస్మీ సమర్థించుకోవడం గమనార్హం.
ఈ వీడియో ఆదివారం సోషల్ మీడియాలో పోస్టు చేయడం గమనార్హం. ఇటీవల ఈద్- అల్ అధా అనే పండగ సందర్భంగా.. దీనికి సంబంధించిన విశేషాలను లేడీ జర్నలిస్ట్ మైరా హస్మీ వివరిస్తున్నారు. ఆమె అలా వివరిస్తున్న సమయంలో చుట్టూ చాలా మంది జనం కూడా ఉన్నారు. ఈ క్రమంలో.. అక్కడే ఉన్న ఓ బాలుడు సదరు లేడీ జర్నలిస్ట్ పట్ల అనుచితంగా ప్రవర్తించాడు.
అతని అసభ్య ప్రవర్తనకు చిర్రెత్తుకుపోయిన మహిళా జర్నలిస్ట్ వెంటనే.. చెంప పగల కొట్టింది. దీనిని కొందరు వీడియో తీయగా.. అది కాస్త వైరల్ గా మారింది.
అయితే.. ఆమె చేసిన పనిని కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆ బాలుడిని కొట్టడం ఆమె తప్పు అని కొందరు ఆమె పై విమర్శలు చేస్తుండగా.. సదరు బాలుడు అసభ్యంగా ప్రవర్తించాడని.. అందుకే కొట్టిందని కొందరు సమర్థిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోని 4లక్షల మందికి పైగా వీక్షించారు. కామెంట్లలో మాత్రం.. ఓ చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది.
ఆ చిన్నపిల్లాడిని కొట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం.. ఆ బాలుడు ఎవరినో ఇబ్బంది పెడుతున్నాడని.. అలాంటి వారిని కొట్టడంలో ఎలాంటి తప్పు లేదన కొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.
