Asianet News TeluguAsianet News Telugu

గేదెలను వేలం వేయనున్న ప్రధాని

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా సోమవారం ప్రభుత్వానికి చెందిన 34 లగ్జరీ వాహనాలను వేలంలో అమ్మేసింది. ఈ కార్లలో బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు కూడా ఉన్నాయి. 

pak  government auctions fleet luxury cars
Author
Islamabad, First Published Sep 17, 2018, 9:19 PM IST

ఇస్లామాబాద్‌ :  ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకునే పనిలో పడింది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే లక్ష్యంగా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా సోమవారం ప్రభుత్వానికి చెందిన 34 లగ్జరీ వాహనాలను వేలంలో అమ్మేసింది. ఈ కార్లలో బుల్లెట్ ఫ్రూఫ్ కార్లు కూడా ఉన్నాయి. 

30లక్షల కోట్ల అప్పుతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ను గట్టెక్కించే ప్రయత్నంలో భాగంగా మొత్తం 102 లగ్జరీ వాహనాలను వేలం వేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా తొలివిడతగా 34 కార్లను విక్రయించారు. రెండో దశ కింద 41 ఇంపోర్టెడ్‌ కార్లను త్వరలోనే వేలానికి పెట్టనున్నట్లు పాక్ సర్కార్ తెలిపింది. వేలానికి సంబంధించిన వాహనాల్లో మెర్సిడెస్‌ బెంజ్‌ కార్లు, బుల్లెట్‌ ప్రూఫ్‌ బీఎండబ్ల్యూలు, టయోటా, లెక్సస్‌, సుజుకీ, హోండా కార్లు, జీపులు ఉన్నాయి.

గత ఏడాది నుంచి పాకిస్థాన్ లో అప్పులు భారీగా పేరుకుపోయాయి. దాదాపు 30 లక్షల కోట్లు అప్పును కలిగి ఉంది పాకిస్థాన్. అంటే పాక్ ఆర్థిక వ్యవస్థలో 87 శాతం అప్పు ఉంది. దీంతో ఇటీవలే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ ఖర్చుల నియంత్రణపై దృష్టిసారించారు. అందులో భాగంగా తొలుత తనకు కేటాయించిన సిబ్బంది సంఖ్యను తగ్గించుకున్నారు. 

సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అధ్యక్షుడు, ప్రధానమంత్రి, స్పీకర్‌, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా వీవీఐపీలందరూ బిజినెస్‌ క్లాస్‌లోనే ప్రయాణించాలని ఆదేశించారు. ప్రభుత్వం వద్ద నిరుపయోగంగా పడి ఉన్న నాలుగు హెలికాప్టర్లను కూడా విక్రయించేందుకు సిద్ధమయ్యారు.

లగ్జరీ కార్లు, హెలికాప్టర్లు మాత్రమే కాదు... మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వ ఖర్చుతో కొనుగోలు చేసిన ఎనిమిది గేదెలను కూడా వేలం వేయ్యాలని ఇమ్రాన్ సర్కార్ నిర్ణయించింది. నిరుపయోగంగా ఉన్న ప్రధాని అధికారిక నివాసాలను సైతం వేలం వేయబోతున్నట్లు ప్రకటించింది.  గత ఏడాది చివరినాటికి పాక్ ఆర్థిక వ్యవస్థలో 87 శాతం.. అంటే రూ.30 లక్షల కోట్ల అప్పును కలిగిఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios