Asianet News TeluguAsianet News Telugu

హఫీజ్ సయీద్ కు 15 ఏళ్ల జైలు శిక్ష రూ. 2 లక్షల జరిమానా: పాక్ కోర్టు

ఇండియాలోని ముంబై టెర్రర్ దాడులకు  మాస్టర్ మైండ్  జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ కు  పాకిస్తాన్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గురువారం నాడు పాకిస్తాన్ యాంటీ టెర్రరిస్టు కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అంతేకాదు  రూ. 2 లక్షల జరిమానాను కూడ సయీద్ కు విధించింది కోర్టు.

Pak court sentences JuD chief Hafiz Saeed to over 15 years in jail in one more terror financing case lns
Author
Pakistan, First Published Dec 25, 2020, 10:23 AM IST

ఇస్లామాబాద్: ఇండియాలోని ముంబై టెర్రర్ దాడులకు  మాస్టర్ మైండ్  జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ కు  పాకిస్తాన్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. గురువారం నాడు పాకిస్తాన్ యాంటీ టెర్రరిస్టు కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అంతేకాదు  రూ. 2 లక్షల జరిమానాను కూడ సయీద్ కు విధించింది కోర్టు.

ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారనే కారణంగా పాకిస్తాన్ కోర్టు ఇప్పటికే 21 జైలు శిక్ష విధించింది.  లాహోర్ లోని యాంటీ టెర్రరిస్ట్ కోర్టు గురువారం నాడు సయీద్ తో పాటు  మరో ఐదుగురు నేతలకు శిక్ష విధించింది.

ఉగ్రవాద సంస్థలకు ఆర్ధిక తోడ్పాటు అందించినందుకు ఐదు నేరాల్లో 36 ఏళ్ల పాటు సయీద్ కు జైలు శిక్ష విధించారు.ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో  రెండు కేసుల్లో 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది.  ఈ ఏడాది నవంబర్ మాసంలో  మరో రెండు కేసుల్లో 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Follow Us:
Download App:
  • android
  • ios