తమ భూభాగంపైకి వచ్చి భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. ధీటైన జవాబిస్తామని పాక్ అధినాయకత్వం భారత్‌కు హెచ్చరికలు పంపింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నుంచి పాక్ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులకు పాల్పడుతోంది.

మరోవైపు పాక్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు బుధవారం భారత భూభాగంలోకి ప్రవేశించాయి. లాంబ్, కెరీ, నరియాన్ ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడ్డ పాక్ ఫైటర్లు.. రెండు భారత యుద్ధ విమానాలను కూల్చేసినట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది.

మరోవైపు పాక్ యుద్ధ విమానాలను వెంటాడిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లాంబ్ వ్యాలీలో ఒక ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాయి. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పాకిస్తాన్ సైన్యం ఎలాంటి చర్యలకు పాల్పడినా తిప్పికొట్టేందుకు భారీ ఎత్తున సైన్యాన్ని మోహరించింది ప్రభుత్వం.