న్యూఢిల్లీ: బ్రిటన్ కు చెందిన ఆస్ట్రాజెనెకా సంస్థ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ 90 శాతం ప్రభావంతంగా పనిచేస్తోంది.

బ్రిటన్, బ్రెజిల్ దేశాల నుండి చివరి దశ ట్రయల్స్ సమాచారం మేరకు ఈ టీకా సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టుగా తేలింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ  కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది. ఈ వ్యాక్సిన్ ప్రయోగించిన వాలంటీర్లపై  సీరియస్ ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని తేలింది. రెండు డోసులలో ఇది రోగులను నయం చేసినట్టుగా తేల్చింది.

కరోనాకు వ్యతిరేకంగా ఈ టీకా సమర్ధవంతంగా పనిచేస్తోందని అస్ట్రాజెనిక్ సీఈఓ పాస్కల్ సోరియట్ చెప్పారు.ఈ మేరకు ఆయన సోమవారం నాడు ఓ ప్రకటనను విడుదల చేశారు.

ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థగా పేరొందిన సీరం సంస్థ ఈ వ్యాక్సిన్ తయారీ చేయనుంది. అస్ట్రాజెనీకా గేట్స్ ఫౌండేషన్, గవి వ్యాక్సిన్ తో సీరం సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది.

కరోనా బారిన పడకుండా ఈ వ్యాక్సిన్ పనిచేస్తోందని తెలిపింది. వైరస్ ను తగ్గించడంతో పాటు తీవ్రమైన వ్యాధి నుండి కాపాడుతోందని  ప్రోఫెసర్ పీటర్ హార్బీ చెప్పారు.

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ప్రోఫెసర్లు అభివృద్ది చేసిన వ్యాక్సిన్ ఫ్రిజ్ లో నిల్వ చేసుకొనే వెసులుబాటు ఉంటుంది.ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాను తుదముట్టించేందుకు ఈ వ్యాక్సిన్ పనికొస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. బ్రిటీష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్  చాలా ప్రభావంతంగా పనిచేస్తోందని తేలిందన్నారు.

అమెరికాకు చెందిన మోడెర్నా టీకా 94.5 శాతం ప్రభావంతంగా పనిచేసిందని డేటా తెలిపింది.జర్మనీకి చెందిన ఫైజర్ సంస్థ ప్రకటించిన డేటా మేరకు 90 నుండి 95 శాతం తమ టీకా పనిచేసిందని ప్రకటించింది.

రష్యాకు చెందిన స్పుత్నిక్- వి వ్యాక్సిన్ కూడా 90 శాతం పైగా ప్రభావంతంగా ఉన్నట్టుగా తెలిపింది.అస్ట్రా వ్యాక్సిన్ కు అల్ట్రా కోల్డ్ స్టోరేజీ అవసరం లేదు. ఇతర కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్లు అల్ట్రా కోల్డ్ స్టోరేజీలు అవసరం.