ఫ్యాక్టరీ రీ ఓపెనింగ్, చైనాలో ముద్దుల పోటీ: ఏకేసిన నెటిజన్లు

కరోనా భయంతో ప్రపంచం గజగజలాడుతోంది.ఈ సమయంలో చైనాలోని ఓ ఫర్నీచర్ ఫ్యాక్టరీ ముద్దుల పోటీ నిర్వహించింది.ఈ  పోటీలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.
 

Outrage As China Factory Holds Kissing Contest To Celebrate Reopening


బీజింగ్: కరోనా భయంతో ప్రపంచం గజగజలాడుతోంది.ఈ సమయంలో చైనాలోని ఓ ఫర్నీచర్ ఫ్యాక్టరీ ముద్దుల పోటీ నిర్వహించింది.ఈ  పోటీలపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

చైనాలోని సుజౌ నగరంలోని యుయూ ఫర్నీచర్ ఫ్యాక్టరీ ముద్దుల పోటీని నిర్వహించింది. ఈ పోటీలో పాల్గొనేందుకు పది జంటలను ఎంపిక చేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారు ఫ్లెక్సీ గ్లాస్ తో వేరు చేయబడ్డారు. గ్లాస్ పై ఎదురెదురుగా నిలబడి ఒకరినొకరు ముద్దులు పెట్టుకొన్నారు.

చైనాలో ఈ ఫర్నీచర్ ఫ్యాక్టరీ రీ ఓపెనింగ్ సమయంలో ఈ పోటీని పెట్టినట్టుగా  7 న్యూస్, గ్లోబల్ న్యూస్ లు ప్రకటించాయి. ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న జంటలు ఈ ముద్దుల పోటీలో పాల్గొన్నట్టుగా  ఫర్నీచర్ ఫ్యాక్టరీ యజమాని మా ప్రకటించారు.

also read:కరోనా సత్తా ఏంటో జనానికి తెలియట్లేదు.. ఉగ్రరూపాన్ని చూస్తారు: డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలు

కరోనాను పురస్కరించుకొని జంటలు ముద్దులు పెట్టుకొనే సమయంలో  ఫ్లెక్సీ గ్లాస్ ఉంచినట్టుగా చెప్పారు. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. ఫ్యాక్టరీలో ఉత్పత్తులు కూడ నిలిచిపోయినట్టుగా ఆయన గుర్తు చేశారు.

ఫ్యాక్టరీ రీ ఓపెనింగ్ సందర్భంగా అందరిని సంతోష పెట్టేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఫ్యాక్టరీ యజమాన్యం ప్రకటించింది. ముద్దుల పోటీ నిర్వహించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios