కొచ్చి నుంచి షార్జాకు మంగళవారం రాత్రి బయల్దేరిన ఫ్లైట్ కాసేపటికే యూటర్న్ తీసుకుంది. ఫ్లైట్‌లో ఉల్లిగడ్డలు, కూరగాయల వాసనలు రావడంతో ప్రయాణికులు పొరపాటుగా భ్రమించి ఆందోళనలు వ్యక్తం చేశారు. ఫ్లైట్‌లో మంటలు పుడుతున్నాయని, అందుకు సంబంధించినదే ఈ వాసన అని భయపడ్డారు. దీంతో ముందు జాగ్రత్తగా పైలట్ విమానాన్ని వెనక్కి తీసుకువచ్చి కొచ్చిలో ల్యాండ్ చేశారు. 

కొచ్చి: కేరళ కొచ్చి నుంచి గల్ఫ్‌లోని షార్జాకు బయల్దేరింది. మంగళవారం బయల్దేరిన ఈ ఫ్లైట్ అర్ధంతరంగా వెనుదిరిగింది. ఆ ఫ్లైట్‌లోని కార్గొలో లోడ్ చేసిన ఉల్లిగడ్డలు, కూరగాయల వాసన ప్రయాణికుల వద్దకు చేరింది. ఆ వాసన గాఢంగా రావడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అది ఉల్లి వాసన అని అనుకోలేదు. ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత ఇంజిన్‌లో నుంచో మరే చోటనుంచో కమురు వాసన వస్తున్నట్టు అనుమానించారు. బహుశా ఏదో కాలిపోతున్నదని, అగ్ని వ్యాపిస్తున్నదనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఫ్లైట్ సిబ్బందికి అదే తెలియజేశారు. దీంతో గత్యంతరం లేక ఫ్లైట్ యూ టర్న్ తీసుకుంది. మళ్లీ కొచ్చిలోకి వచ్చి ల్యాండ్ అయింది.

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఫ్లైట్ (ఐఎక్స్ 411) ఫ్లైట్ ఆగస్టు 2వ తేదీ రాత్రి కొచ్చి నుంచి టేకాఫ్ అయింది. ఆ ఫ్లైట్ షార్జాకు వెళ్లాల్సి ఉన్నది. కానీ, ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే ఒక రకమైన గాఢమైన వాసన రావడంతో ప్రయాణికుల్లో ఆందోళనలు చెలరేగాయి. దీంతో ఫ్లైట్ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు తిరిగివచ్చింది.

Also Read; యువతిని 14 ఏళ్లు బంధించి అఘాయిత్యం.. వెయ్యి సార్లు లైంగికదాడి

ఇంజినీరింగ్ టీమ్ ఆ ఫ్లైట్‌ తనిఖీ చేశారు. మంటలకు సంబంధించిన వాసన గానీ, టెక్నికల్ ఇష్యూ గానీ లేవని స్పష్టం చేసింది. ఆ వాసనను ఫ్లైట్ కార్గో సెక్షన్‌లోని ఉల్లిగడ్డలు, కూరగాయల వల్లే అయి ఉండొచ్చని చెప్పింది. ముందు జాగ్రత్తగా ఫ్లైట్ యూ టర్న్ తీసుకున్నారని కొన్ని విశ్వసనీయ వర్గాలు వివరించాయి.