రికార్డ్ సృష్టించిన వన్ ప్లస్6 స్మార్ట్ ఫోన్

OnePlus 6 becomes fastest selling OnePlus device with 1 million units sold
Highlights

10లక్షల యూనిట్ల అమ్మకం

చైనాకి చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ వన్ ప్లస్.. భారత మార్కెట్లో రికార్డ్ సృష్టించింది. కేవలం 22 రోజుల్లో 6లక్షల వన్ ప్లస్ 6 స్మార్ట్ ఫోన్లు అమ్ముడయ్యాయి.  ఈ ఫోన్ కి ప్రస్తుతం  విపరీతమైన డిమాండ్  ఉందని.. ఇంత ఆదరణ లభిస్తుందని ఊహించలేదని  కంపెనీ సీఈఓ పెటే లూ తెలిపారు.

ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో వన్ ప్లస్ 6కు చాలా ఆదరణ లభిస్తోంది. ఇదివరకు వన్ ప్లస్ 5, 5టీ మోడల్ ఫోన్లు 10 లక్షల టార్గెట్ ను అందుకోవడానికి 3 నెలలు పట్టింది. వన్ ప్లస్6 మన దేశంలో రూ.34,999కి దొరుకుతోంది.  జీబీ ర్యామ్, 64జీబీ వేరియంట్ ధర. 8జీబీ ర్యామ్, 128 జీబీ వెర్షన్ స్టోరేజీ ధర రూ.39,999. ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు దీని సొంతం. 6.28 ఇంచుల ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ ఉంది.

వన్ ప్లస్ 6 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు..
16, 20 మెగాపిక్సల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, , 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, డ్యాష్ చార్జి, 6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, 2280 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, వాట‌ర్ రెసిస్టెన్స్ బాడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి

loader