Asianet News TeluguAsianet News Telugu

ఒక్కడి నిర్లక్ష్యంతో 300మందికి కరోనా... ఏడుగురి మృతి

దక్షిణ ఓరేగాన్‌ కు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతూ కూడా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. 

One person with covid-19 went to work... 7 people died and 300 had to quarantine
Author
USA, First Published Dec 24, 2020, 5:36 PM IST

ఓరేగాన్: అమెరికాలో కరోనా మహమ్మారి కల్లోలం స్రుష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే లక్షల్లో మరణించగా లక్షలాది మంది ఇంకా ప్రాణాపాయ స్థితిలో వున్నారు. ఇలా అమెరికాలో కరోనా విజృంభణకు అక్కడి వాతావరణం అనుకూలత ప్రధాన కారణమయితే ప్రజల నిర్లక్ష్యం కూడా మరో కారణం. కరోనాను లేక్కచేయకుండా ఓ వ్యక్తి చేసిన తప్పిదం పలువురి ప్రాణనష్టానికి దారితీసిన ఘటన దక్షిణ ఓరేగాన్ లో చోటుచేసుకుంది.

దక్షిణ ఓరేగాన్‌ కు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతూ కూడా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఇంట్లోనే క్వారంటైన్ లో వుండటం గానీ, హాస్పిటల్ కు వెళ్లి చికిత్స పొందడం కానీ చేయకుండా డ్యూటీకి వెళ్లాడు. ఆ తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో టెస్ట్ చేసుకోగా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో అతడికి డాక్టర్లు కరోనా చికిత్స అందించారు.

అయితే అతడి నిర్లక్ష్యం కారణంగా ఏకంగా 300మంది ఈ వైరస్ బారిన పడ్డారు. అంతేకాకుండా మరో ఏడుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఓ వ్యక్తి నిర్లక్ష్యం పలువురి ప్రాణాలను బలితీసుకోగా మరెంతో మదిని ప్రమాదంలోకి నెట్టింది.

Follow Us:
Download App:
  • android
  • ios