పాకిస్థాన్ కేంద్రంగానే ఉగ్రసంస్థలు భారత్ లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతున్నట్లు అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. ముంబయి దాడులకు సూత్రధారి మసూద్ అజర్, సాజిద్ మీర్‌లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. ఉగ్రవాద చర్యలను గుర్తించడంతో జాతీయ దర్యాప్తు సంస్థతో (ఎన్ఐఏ) పాటు ఇతర తీవ్రవాద నిరోధక దళాలు చురుగ్గా పనిచేస్తున్నాయని అమెరికా ప్రశంసించింది.
US report on terrorism: పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాద సంస్థలు పని చేస్తోన్నాయని, భారత్ లక్ష్యంగా చేసుకొని పలు ఉగ్ర సంస్థలు దాడులకు దిగుతున్నట్టు అమెరికా రక్షణ శాఖ మరోసారి స్పష్టం చేసింది. లష్కర్-ఏ-తోయిబా, జైషే మహమ్మద్‌తో పాటు అనుబంధ సంస్థలు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోన్నాయనీ, పాక్ సరిహద్దు దేశమైన భారత్‌పై దాడులకు పాల్పడుతున్నాయని తెలిపింది. పాక్‌లోని కొన్ని మదర్సాల్లో తీవ్ర భావజాలాన్ని పెంచి పోషిస్తున్నాయని తెలిపింది. దాదాపు 12 ఉగ్రసంస్థలకు పాక్ కేంద్రంగా మారిందని అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్ వెల్లడించారు.
ముంబయి దాడుల సూత్రధారి మసూద్ అజర్, సాజిద్ మీర్ వంటి వారిని ఐక్యరాజ్యసమితి ఇంటర్నెషనల్ టెర్రరిస్టులుగా గుర్తించిన వారిపై పాకిస్థాన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న వారు ఆ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని వెల్లడించారు. పాకిస్థాన్ కేంద్రంగానే ఉగ్రముఠాలు పనిచేస్తున్నాయని మరోసారి ఉద్ఘాటించారు. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ గురువారం 2020 కంట్రీ రిపోర్ట్స్ ఆన్ టెర్రరిజం పేరుతో ఓ నివేదికను విడుదల చేశాడు. ఈ నివేదికలో సంచలన విషయాలను వెల్లడించారు. భారత్ , యూఎస్ లు కలిసి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ రిజల్యూషన్ (యుఎన్‌ఎస్‌సిఆర్) 2309ని అమలు చేస్తోన్నయని బ్లింకెన్ తెలిపారు.
Read Also : ఒమిక్రాన్ వేరియంట్‌ను స్పుత్నిక్ వీ సమర్థంగా ఎదుర్కొంటుంది.. రష్యా ప్రభుత్వం
గ్లోబల్ టెర్రరిస్ట్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్‌లో భారత్‌కు చెందిన 66 మంది ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్‌లో(ఐసిస్) భాగంగా పని చేస్తున్నారని అమెరికా తన నివేదికలో పేర్కొంది. 2020లో విదేశీ ఉగ్రవాదులు (ఫారిన్ టెర్రిరిస్ట్ ఫైటర్స్) ఎవరూ భారత్‌కు తిరిగి రాలేదని చెప్పింది. ఈ క్రమంలో భారత్ కు చెందిన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఉగ్ర చర్యలను సకాలంలో గుర్తించి, ఐసిస్‌తో సంబంధం ఉన్న 34 ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన కేసులను పరిశీలించి..160 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు చెప్పిందని, వెస్ట్ బెంగాల్, కేరళ కేంద్రంగా పని చేసే 10 మంది అల్- ఖైదా ఉగ్రవాదులు కూడా ఉన్నారని వెల్లడించింది. ఈ చర్య ప్రశంసనీయమని US స్టేట్ డిపార్ట్‌మెంట్ వార్షిక నివేదిక తెలిపింది.
Read Also : Japan Fire accident: భారీ అగ్నిప్రమాదం.. 27 మంది మృతి
పాక్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న LeT సహా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న సమూహాలు జేఈఎం వ్యవస్థాపకుడు మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులపై చర్య తీసుకోవడంలో పాకిస్థాన్ విఫలమైందని నివేదిక తెలిపింది. రతదేశం పాకిస్తాన్ నుండి ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటుందని తెలిపింది. ఎల్‌ఇటి, జెఎమ్, హిజ్బుల్ ముజాహిదీన్, ఐఎస్‌ఐఎస్, అల్-ఖైదా మరియు జమాత్-ఉల్-ముజాహిదీన్ వంటి ఉగ్రవాద సంస్థలు భారత్‌ను లక్ష్యంగా దాడులు చేస్తోన్నాయని పేర్కొంది. ఇవి భారత్‌లోని జమ్ముకశ్మీర్, ఈశాన్య భారత్, మధ్య భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో యాక్టివ్‌గా ఉన్నాయని అమెరికా నివేదిక తెలిపింది.
Read Also : నాటు వైద్యం చేయిస్తానని తీసుకెళ్లి.. మైనర్ బాలికతో బలవంతంగా వ్యభిచారం.. ఆరోగ్యం క్షీణించడంతో...
ఈ ఉగ్రసంస్థల కార్యకలాపాలను అణచివేయడంలో భారత్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందని చెప్పింది. పాకిస్థాన్‌లోని కొన్ని మదర్సాలు హింసాత్మక తీవ్రవాద సిద్ధాంతాలను బోధిస్తూనే ఉన్నాయని పేర్కొంది. జమ్ముకశ్మీర్‌లో అల్-ఖైదా అనుబంధ సంస్థ అన్సర్ ఘజ్వాత్-ఉల్-హింద్‌కు చెందిన పలువురు కీలక ఉగ్రనేతలను భారత దళాలు అణచివేసిన విషయాన్ని అమెరికా తన నివేదికలో ప్రస్తావించింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో ఎల్‌ఇటి వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ మరియు ఇతర సీనియర్ ఎల్‌ఇటి నాయకులను పాకిస్తాన్ దోషులుగా నిర్ధారించింది.
హింసాత్మక తీవ్రవాదాన్ని (CVE) ఎదుర్కోవడానికి జాతీయ విధానం లేదని నివేదిక కేంద్ర హోం మంత్రిత్వ శాఖను తప్పుబట్టింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ - CVE విధానాలను కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది.
