కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్‌తో పిల్లల్లో హార్ట్ ఎటాక్ ముప్పు ఎక్కువగా ఉంటుందని అమెరికాలోని విశ్వవిద్యాలయాలు తమ అధ్యయనంలో తేల్చాయి. ఈ వేరియంట్ కారణంగా పిల్లల్లో అప్పర్ ఎయిర్‌వే ఇన్ఫెక్షన్ కలిగే ముప్పు పెరుగుతుందని, ఈ అప్పర్ ఎయిర్‌వే ఇన్ఫెక్షన్ మూలంగా హార్ట్ ఎటాక్ సహా ఇతర జటిల సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువ అని వివరించాయి.
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా పిల్లల్లో హార్ట్ ఎటాక్ ముప్పు ఎక్కువ అని అమెరికాలోని విశ్వవిద్యాలయాల అధ్యయనంలో తేలింది. కరోనా వైరస్ ఇతర వేరియంట్‌ల కంటే కూడా ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా పిల్లల్లో అప్పర్ ఎయిర్‌వే ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు తేల్చారు. ఈ అప్పర్ ఎయిర్‌వే ఇన్ఫెక్షన్‌తో హార్ట్ అటాక్ సహా ఇతర జటిల సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువ అని వివరించారు.
నేషనల్ కోవిడ్ కొహర్ట్ కొలాబరేటివ్ నుంచి 19 ఏళ్లలోపు 18,849 మంది చిన్నారుల డేటాను ఈ అధ్యయనానికి తీసుకున్నారు. అమెరికాలోని కొలరాడో, నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీ, స్టోనీ బ్రూక్ యూనివర్సిటీలు ఈ అధ్యయనం చేశాయి. ఈ పరిశోధనపత్రాలు జామా పీడియాట్రిక్స్‌లో గతవారం ప్రచురితమయ్యాయి.
ఈ అధ్యయనంలో ఒమిక్రాన్ వేరియంట్ పిల్లల్లో అప్పర్ ఎయిర్‌వే ఇన్ఫెక్షన్‌ను ఎక్కువగా కలిగించే అవకాశం ఉన్నదని తేలింది. ఒమిక్రాన్ సోకడానికి ముందు, ఒమిక్రాన్ డామినెంట్‌గా ఉన్న కాలంనాటి డేటాను పరిశీలిస్తే.. అప్పర్ ఎయిర్‌వే ఇన్ఫెక్షన్ బారిన పడ్డ సగటు పిల్లల వయసు నాలుగేళ్ల ఐదు నెలల నుంచి రెండేళ్ల ఒక నెలకు పడిపోవడం గమనార్హం.
కాగా, అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ డామినెంట్‌గా ఉన్నప్పుడు పిల్లల్లో అప్పర్ ఎయిర్‌వే ఇన్ఫెక్షన్ కేసులు ఎక్కువగా రిపోర్ట్ అయ్యాయా? అనే కోణంలోనూ అధ్యయనాలు జరిగాయి. అయితే, పిల్లల్లో ఇలాంటి ఆరోగ్య సమస్యల్లో ఒమిక్రాన్ కంటే ముందు.. ఒమిక్రాన్ ప్రాబల్యంలో ఉన్న కాలంలో పెద్దగా మార్పు లేదని గుర్తించారు.
మొత్తంగా 21.1 శాతం పిల్లలు కరోనాతో, అలాగే, అప్పర్ ఎయిర్‌వే ఇన్ఫెక్షన్‌తో హాస్పిటల్‌లలో చేరారు. అయితే, కొవిడ్ కారణంగా యూఏఐ కేసులు ఆరోగ్య వ్యవస్థకు సవాల్ చేసే స్థాయిలో లేవని ఆ పరిశోధన వెల్లడించింది.
2021 డిసెంబర్ చివరినాటికి అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ అధిక ప్రాబల్యంలోకి వచ్చింది. అత్యధిక వేగంతో వ్యాప్తి చెందే ఈ వేరియంట్ డెల్టా వేరియంట్‌తో పోలిస్తే.. తక్కువ తీవ్రత కలిగినదే. ఊపిరితిత్తుల కణజాలంలో వైరస్ రిప్లికేషన్ తక్కువగా ఉండటమే ఇందుకు కారణం అయి ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ఊపిరితిత్తుల కణాల్లో కంటే శ్వాస మార్గాల్లో దాని ప్రభావం ఎక్కువ చూపించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
భారత్‌లో మరోసారి కరోనా మహమ్మారి కలవరం సృష్టిస్తుంది. గత కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. మరోసారి పెరుగుతున్నాయి. తాజాగా రోజువారి కేసుల్లో భారీ పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,813 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. అయితే కిందటి రోజు నమోదైన 1,150 కరోనా కేసులతో పోల్చితే.. కరోనా కేసుల్లో 89.8 శాతం పెరుగుదల ఉంది. మరోసారి కరోనా కేసుల్లో పెరుగుదల నమోదవ్వడంతో జనాల్లో ఆందోళన చెందుతున్నారు. ఫోర్త్ వేవ్ మొదలు కానుందా..? అనే టెన్షన్ నెలకొంది.
మరోవైపు రోజువారి మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. తాజాగా 214 మంది కరోనా మృతిచెందారు. అయితే ఇందులో కేరళ నుంచే 213 ఉన్నాయి. వీటిలో 62 బ్యాక్‌లాగ్ మరణాల సంఖ్య ఉన్నప్పటికీ.. కిందటి రోజుతో పోలిస్తే మరణాల సంఖ్య భారీగానే పెరిగింది. మరోవైపు కరోనా రోజువారి పాజిటివ్ రేటు కూడా భారీగా పెరిగింది. నిన్న 0.31 శాతంగా ఉన్న కరోనా రోజువారి పాజిటివ్ రేటు.. నేడు 0.83 శాతానికి పెరిగింది.
