Asianet News TeluguAsianet News Telugu

ఒమిక్రాన్‌ కూడా డేంజరే: డబ్ల్యుహెచ్ఓ చీఫ్ టెడ్రోస్

కరోనా ఓమిక్రాన్ కూడా డేంజరేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. ఇతర వేరియంట్ల మాదిరిగానే ఒమిక్రాన్ తో కూడా కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతుందని డబ్ల్యుహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ తెలిపారు. గత వారంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య 71 శాతం పెరిగినట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

Omicron Is Hospitalising And Killing People: WHO Chief's Warning
Author
New Delhi, First Published Jan 7, 2022, 10:53 AM IST

న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ వైరస్  కూడా డేంజరే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. ఈ వైరస్ ను తేలికగా తీసుకోవద్దని కూడా WHO ప్రకటించింది. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వైరస్  వేగంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యుహెచ్ఓ చీఫ్ Tedros Adhanom Ghebreyesus  తేల్చి చెప్పారు.

Deltaతో పోలిస్తే Omicron తీవ్రత తక్కువగా ఉందనే భ్రమను వీడాలని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్సఫ్టం చేసింది. గతంలోని కరోనా వేరియంట్ ల మాదిరిగానే  ఒమిక్రాన్ తో కూడా ఆసుపత్రులు నిండిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

గతంలో కంటే ఆసుపత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. గత వారంలో ప్రపంచ వ్యాప్తంగా 9.5 మిలియన్ల కంటే  తక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి.  అయితే ఇది ఒక రికార్డు. గత వారంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య 71 శాతం పెరిగింది. క్రిస్‌మస్, కొత్త సంవత్సరం  వేడుకల తర్వాత పరీక్షల వివరాలు ఇంకా రావాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.Corona వ్యాక్సిన్ ను అన్ని దేశాలకు సమానంగా అందాల్సిన అవసరం ఉందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది.

 ప్రతి దేశ జనాభాలో 2021 డిసెంబర్ నాటికి 40 శాతం  టీకాలు వేసుకోవాల్సిన పరిస్థితులున్నాయని టెడ్రోస్ గుర్తు చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థలోని 194 సభ్య దేశాల్లో 92 దేశాలు వ్యాక్సిన్ విషయంలో తమ లక్ష్యాన్ని చేరుకోలేదు.  36 దేశాల్లో 10 శాతం కూడా Vaccine కూడా పూర్తి చేయలేదు.ఈ ఏడాది ప్రతి దేశంలో 70 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని భావిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

వ్యాక్సిన్ల అసమానత ప్రజలను, ఉద్యోగాలను చంపేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆర్ధిక పునరుద్దరణను కూడా బలహీనపరుస్తుందని కూడా టెడ్రోస్ అభిప్రాయపడ్డారు.  కరోనాలో ఒమిక్రాన్ చివరి వేరియంట్ కాదని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్ లీడ్ వాన్ కెర్దోవ్ చెప్పారు. కరోనా నుండి కాపాడుకొనేందుకు గాను ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన కోరారు. తమ సలహాను సమర్ధవంతంగా, సమగ్రంగా పూర్తి చేయాలని కూడా  ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిచెప్పింది.మాస్కులు లేకుండా ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం చూసి తాను ఆశ్చర్యపోయాయని కెర్దోవ్ చెప్పారు. ముక్కు, మూతిని మాస్క్‌తో కప్పుకోవాలని ఆయన తెలిపారు.

ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని కూడా డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకొన్న వారిలో  కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని డబ్ల్యు హెచ్ ఓ ప్రకటించింది.  గురువారం నాడు యూకేలో 179756 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 231 మంది మరణించారు.   ఈ మాసంలో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని యూకే ప్రభుత్వం భావిస్తుంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరింది.డెల్టా వేరియంట్ కారణంగా ఆసుపత్రుల్లో ఐసీయూలు నిండిపోయాయి. ఒమిక్రాన్ తో ఆసుపత్రుల్లో సాధారణ వార్డులు నిండిపోతున్నాయి. ఫ్రాన్స్ లో గురువారం నాడు 2,61,000 ల కేసులు నమోదయ్యాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios