మనుషులతో మనుషులు శృంగారం చేయటం సహజమే కానీ అదే మనుషులు మరమనుషులతో శృంగారం చేస్తే? వినడానికే విచిత్రంగా ఉంది కదా. కానీ భవిష్యత్తులో ఇదే జరగబోతోంది. ప్రస్తుతం టెక్నాలజీ రంగంలో కృత్రిమ పరిజ్ఞానం (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ దిశగా మనషి మేధస్సుకు ధీటుగా స్పందించే మరమనుషులను సృష్టిస్తున్నారు.

ఇప్పటికే సోఫియా రోబోట్ మనుషుల మాదిరగానే ఆలోచిస్తూ, ప్రవర్తిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా మరో కొత్త రోబోట్ ఇప్పుడు పురుషులను ఆకర్షిస్తోంది. పడక గదిలో ఓ సాధారణ మహిళ చేయగలిగిన అన్ని పనులను ఈ మరమనిషి చేయనుంది. అందుకే ఈ రోబో అంత స్పెషల్. ఈ రోబో పేరు సమాంత. సెర్గి శాంటోస్ అనే శాస్త్రవేత్త ఈ రోబోట్‌ను సృష్టించారు.

కేవలం శృంగారమే ప్రధమ ప్రయోజనంగా ఈ సమాంత రోబోను తయారు చేశారు. సిలికోన్‌ను ఉపయోగించి రోబో శరీర భాగాలను తయారు చేశారు. ఇందులోని ప్రతి భాగం నిజంగా మనిషి చర్మం లాంటి అనుభూతిని ఇస్తుందని దీని సృష్టికర్త చెబుతున్నాడు. ఈ సెక్స్ రోబోట్‌ను కొనాలనుకునే వారు సుమారు ఐదు వేల డాలర్లు (మూడు లక్షల రూపాయలకు పైమాటే) చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, ఈ సెక్స్ రోబోట్స్‌ని ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా వెల్లండించలేదు. మరోవైపు ఈ రోబోట్ విషయంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది సమాజానికి చెడు సంకేతాలను పంపిస్తుందని, ఇలాంటి పనికిమాలిన రోబోలను తయారు చేసే బదులు సమాజానికి ఉపయోగపడే అంశాలపై దృష్టి పెడితే బాగుంటుదని నిపుణులు భావిస్తున్నారు.