ఇస్లామాబాద్: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం విషయంలో పాకిస్తాన్ మాట మార్చింది. శనివారం నాడు విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలో దావూద్ ఇబ్రహీం పేరును పాకిస్తాన్ చేర్చింది.  అయితే  దావూద్ ఇబ్రహీం విషయంలో 24 గంటల్లోనే పాకిస్తాన్ మాట మార్చింది.

దావూద్ ఇబ్రహీం తమ వద్ద లేడని పాకిస్తాన్ తేల్చి చెప్పింది. వీడియాలో వచ్చిన వార్తపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆదేశం ప్రకటించింది. 

పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన వ్యక్తులు, సంస్థలపై నిషేధం విధించింది పాకిస్తాన్, ఈ మేరకు వారి జాబితాను విడుదల చేసింది. ఆయా సంస్థలు, వ్యక్తులపై నిషేధం విధించింది.

అయితే దావూద్ ఇబ్రహీం తమ దేశంలో ఉన్నట్టుగా  మీడియాలో వస్తున్న వార్తలను పాకిస్తాన్ ఖండించింది. చాలా ఏళ్లుగా దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే ఉన్నాడని ఇండియా ఆరోపిస్తోంది. ఈ మేరకు పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై భారత్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ప్రజలను తప్పుదోవ పట్టించేవిధంగా భారత మీడియా వ్యవహరిస్తోందని పాకిస్తాన్ విదేశాగంగ ఆరోపిస్తోంది.