Asianet News TeluguAsianet News Telugu

సౌత్ కొరియన్ మూవీస్ చూసినందుకు ఇద్దరు మైనర్‌లను చంపేసిన నార్త్ కొరియా

దక్షిణ కొరియా సినిమాలను ఉత్తర కొరియా వాసులు చూడటం నిషేధం. ఇలా రహస్యంగా సౌత్ కొరియన్, అమెరికన్ డ్రామాలు చూసిన టీనేజర్లను ఉత్తర కొరియా ప్రభుత్వం బహిరంగంగా చంపేసింది.
 

north korea executes teens for watching south korean movies
Author
First Published Dec 6, 2022, 1:36 PM IST

న్యూఢిల్లీ: దక్షిణ కొరియా సినిమాలంటే చాలా మంది ఇష్టపడతారు. సినీ ఫీల్డ్ వాళ్లే కాదు.. సినిమాపై మక్కువ పెంచుకున్న మూవీ లవర్స్ అంతా సౌత్ కొరియన్ పిక్చర్స్‌ను ఎంతో ఇష్టంగా వీక్షిస్తారు. సున్నితమైన, అరుదైన పాయింట్ తీసుకుని ఆసక్తిగా చిత్రాన్ని వారు మలిచే విధానం అద్భుతంగా ఉంటుంది. అందుకే ప్రపంచమంతా సౌత్ కొరియన్ డ్రామాస్ పై మనుసు పారేసుకుంటారు. కానీ, దాని దాయాది దేశం ఉత్తర కొరియా మాత్రం దక్షిణ కొరియా సినిమాలు చూడవద్దని నిర్దేశించుకుంది. ఎవరు చూసినా వారు చట్ట ఉల్లంఘనలు అని ఎంత పెద్ద శిక్ష అయినా విధిస్తున్నది. తాజాగా, ఓ ఇద్దరు మైనర్లనూ దక్షిణ కొరియా సినిమాలు చూశారని బహిరంగంగా కాల్చి చంపేసింది.

దక్షిణ కొరియా సినిమాలను వీక్షించినందుకు, డిస్ట్రిబ్యూట్ చేసినందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం ఇద్దరు మైనర్లను దోషులుగా ప్రకటించింది. అందరికి చూపిస్తూ బహిరంగంగా వారిని కాల్చి చంపేసింది. ఇలా ఉత్తర కొరియా బహిరంగ శిక్షలు వేయడం మాత్రం అరుదుగానే బయటకు వస్తున్నాయి. 

నార్త్ కొరియా ర్యాంగ్యాంగ్ అనే ప్రావిన్స్ దాని సరిహద్దును చైనాతో పంచుకుంటుంది. ఈ ప్రావిన్స్‌కు చెందిన టీనేజర్లు ఇటీవలే ఓ హై స్కూల్‌లో కలుసుకున్నారు. వారు అక్టోబర్‌ నెలలో చాలా కొరియన్, అమెరికన్ డ్రామా షోస్ చూసినట్టు ది ఇండిపెండెంట్ అనే మీడియా కొరియన్ మీడియాను ఉల్లేఖిస్తూ రిపోర్ట్ చేసింది.

Also Read: జ‌పాన్ మీదుగా దూసుకెళ్లిన ఉత్తర కొరియా బాలిస్టిక్ మిస్సైల్..

ఆ టీనేజర్లను నగరంలోని ఓ ఎయిర్‌ఫీల్డ్ సమీపంలో ప్రజల ముందుకు తెచ్చింది. బహిరంగంగా శిక్షిస్తూ కాల్చేసినట్టు ఆ కథనం పేర్కొంది.

కొరియన్ ప్రభుత్వం ప్రకారం టీనేజర్లు పాల్పడిన నేరం పైశాచికమైనవని పేర్కొంది. వీరికి మరణ శిక్ష అమలు చేస్తున్నప్పుడు చూడాలని స్థానికులపై ఒత్తిడి చేయడం గమనార్హం.

2020లో ఉత్తర కొరియా భావజాలం, సాంస్కృతిక పరికరాలకు సంబంధించి కొన్ని చట్టాలను రూపొందించింది. ఇందులో విదేశీ సమాచారం, విదేశీ ప్రభావాలు వేసే అంశాలను నిషేధించింది. దక్షిణ కొరియా షోస్, మ్యూజిక్, సినిమాల పాపులారిటీ పెరిగిన నేపథ్యంలో ఈ చట్టాన్ని తెచ్చినట్టు విమర్శకులు పేర్కొంటున్నారు.

దక్షిణ కొరియా సినిమాలను ఫ్లాష్ డ్రైవ్‌లలో స్మగుల్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫైన్‌లు, కఠిన శిక్షల నుంచి తప్పించుకోవడానికి గుట్టుగా వాటిని వీక్షిస్తున్నట్టు తెలుస్తున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios