ఒక్క స్టూడెంట్ కూడా రాలేదని బాధ పడ్డాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే... స్టూడెంట్స్ వచ్చారు.. కానీ ఆయనే మర్చిపోయే వేరే క్లాస్ రూమ్ లో కూర్చున్నాడు. 

కాలేజీ, యూనివర్శిటీలలో.... చాలా మంది విద్యార్థులు క్లాసులు బంక్ కొట్టి సినిమాలకీ, షికార్లకు వెళ్తూ ఉంటారు. దానిలో ఎలాంటి కొత్తేమీ లేదు. అయితే.... ఒకేసారి క్లాస్ లోని 40 మంది విద్యార్థులు క్లాస్ కి రాకపోతే ఎలా ఉంటుంది..? ఓ ప్రొఫెసర్ కి అదే సంఘటన ఎదురైంది. దీంతో ఆయన తెగ ఫీలైపోయాడంట. ఒక్క స్టూడెంట్ కూడా రాలేదని బాధ పడ్డాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే... స్టూడెంట్స్ వచ్చారు.. కానీ ఆయనే మర్చిపోయే వేరే క్లాస్ రూమ్ లో కూర్చున్నాడు. అక్కడ ఈ పొరపాటు జరిగింది. ఆ తర్వాత విషయం తెలుసుకొని ఆయన షాకయ్యాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Scroll to load tweet…

అమెరికాలోని ఓ యూనివర్సిటీలో జోసెఫ్్ ముల్లిన్స్ అనే వ్యక్తి ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. రోజూలాగానే ఓ రోజు ఆయన క్లాస్ చెప్పడం కోసం యూనివర్శిటీలోని ఓ క్లాస్ రూమ్ కి వెళ్లాడు. అయితే... ఆ గదిలో ఒక్క స్టూడెంట్ కూడా లేకపోయే సరికి ఆయన చాలా బాధ పడ్డాడట. తన క్లాస్ నచ్చక ఎవరూ రాలేదా అని తెగ ఫీలైపోయాడు. వెంటనే.... స్టూడెంట్స్ కి క్లాస్ కి ఎందుకు రాలేదు అని మెయిల్ చేశాడట. కాసేపటికే ఆయనకు రిప్లై వచ్చిందట. స్టూడెంట్స్ అందరూ వచ్చారని... ఆయనే పొరపాటున వేరే గదికి వెళ్లి ఉంటారని. దీంతో.... ఆ తర్వాత ఆయన వెంటనే ఆ క్లాస్ కి వెళ్లాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేయగా.... అది కాస్త వైరల్ గా మారింది. తన పొరపాటుకు ఆయనే సిగ్గుపడటం విశేషం. ఈ విషయాన్ని ఆయన తన స్నేహితులతో కూడా పంచుకున్నారట. మొత్తానికి ఆయన ట్వీట్ మాత్రం వైరల్ గా మారింది.