వైద్య శాస్త్రంలో ఈ సారి ఇద్దరు అమెరికా సైంటిస్టులకు నోబెల్ వరించింది. స్టాక్‌హోంలోని నోబెల్ జ్యూరి కమిటీ డేవిడ్ జూలియస్, అర్డెమ్ పాటపౌటియన్‌లకు నోబెల్ ప్రకటించింది. 

న్యూఢిల్లీ: అమెరికా శాస్త్రవేత్తలు డేవిడ్ జూలియస్, అర్డెమ్ పాటపౌటియన్‌లకు సోమవారం వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం ప్రకటించారు. వైద్యశాస్త్రంలో వీరు అద్భుత పరిశోధనలు చేశారని నోబెల్ జ్యూరీ కమిటీ పేర్కొంది. ఉష్ణం, శీతలం, మెకానికల్ ఫోర్స్‌లు నరాల్లో కలిగించే సంకేతాలను అర్థం చేసుకోవడానికి వీరిరువురూ ప్రయోగాలు చేశారని వివరించింది. ఈ సంకేతాలతోనే మనం ప్రపంచాన్ని, మనచుట్టూ ఉన్న పరిసరాలను అనుభూతి చెందుతున్నానని తెలిపింది.

‘మన రోజువారీ జీవితంలో ఇలాంటి అనుభూతులను పెద్దగా పట్టించుకోం. కానీ, మన చుట్టు ఉన్న ఉష్ణోగ్రతలు, పీడనాలకు మన నరాలు ఎలా ప్రతిస్పందించి వాటిని అనుభూతి చెందడానికి సహకరిస్తాయో ఈ ఇద్దరు నోబెల్ లౌరెట్స్ మనకు వివరించారు’ అని నోబెల్ జ్యూరీ కమిటీ వెల్లడించింది.

Scroll to load tweet…

సాన్‌ఫ్రాన్సిస్కోలోని ఓ కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రొఫోసర్ డేవిడ్ జూలియస్ దీనిపై పరిశోధనలు చేశారు. చర్మంపై మంట పుట్టించే మిరప, మిరియాల మిశ్రమంతో ఆయన ప్రయోగాలు చేశారు. వీటిని రుద్దినప్పుడు శరీరంలో చర్మం పొర చివరన నరాలు ఎలా ప్రతిస్పందిస్తున్నాయనే, ఎలా హీట్‌ను కలుగజేస్తున్నాయని కనుగొన్నారు. కాగా, స్క్రిప్స్ రీసెర్చ్‌లోని హొవార్డ్ హ్యూస్ మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లో అర్డెమ్ పాటపౌటియన్ ప్రయోగాలు చేశారు. ప్రెజర్ సెన్సిట్ కణాల ద్వారా చర్మం, అంతర్గత అవయవాలలోని కణాలు ఎలా స్పందిస్తున్నాయే పరిశీలనలు చేశారు. వైద్యశాస్త్రం లేదా ఫిజియాలజీలో వీరి కృషికి స్టాక్‌హోం‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది.