ఇథోపియా ప్రధాని అబి అలీ అహ్మద్  నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. శాంతి కోసం ఇథోపియా ప్రధాని 20 ఏళ్లుగా చేసిన కృషికి గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా శాంతి కోసం అబి అలీ అహ్మద్  కృషి చేశారు. శాంతి స్థాపనే  లక్ష్యంగా  ఆయన  పనిచేశారు. దీంతో నోబెల్ పురస్కార కమిటీ ఆయనకు శాంతి పురస్కారాన్ని  అందించింది.

2018 ఏప్రిల్  నుండి ఇథిపియో ప్రధాని శాంతి స్థాపన లక్ష్యంగా  పనిచేస్తున్నాడు. ఇథిపియో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఆరు మాసాల్లోనే జైల్లో ఉన్న నిరసనకారులను ఆయన విడుదల చేశారు. అంతేకాదు వారిని జైల్లో ఉంచినందుకు క్షమాపణలు కూడ చెప్పారు.

ప్రస్తుతం దేశాన్ని ఆర్ధికంగా బలోపేతం చేసే దిశగా ఆయన చర్యలు చేపట్టారు. వచ్చే ఏడాది  మే మాసంలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ  తరుణంలో  నోబెల్ పురస్కారం దక్కడంతో ఆయన సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.