Asianet News TeluguAsianet News Telugu

ప్రజాస్వామ్యం ముచ్చటే లేదు.. షెరియాను ఫాలో అవ్వాల్సిందే : తాలిబన్లు

తాలిబన్లు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ విధానం అవుట్ లైన్ ను హషిమి తెలిపారు. ఇది 1996-2001 మధ్య తాలిబన్ల ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉంది. అప్పట్లో తాలిబన్ల అధినాయకుడు ముల్లా ఒమర్ తెరమాటున ఉండి, దేశంలో రోజువారీ కార్యకలాపాలను ఒక పాలకమండలికి వదిలేశారు.

No democracy, only Sharia law in Afghanistan, says the Taliban
Author
Hyderabad, First Published Aug 19, 2021, 9:55 AM IST

అమెరికా సైన్యం అఫ్ఘానిస్తాన్ ను వీడిన రోజుల వ్యవధిలోనే ఆ దేశం తాలిబన్ల వశమైంది. ఈ క్రమంలో అక్కడి ప్రజాస్వామ్య ప్రభుత్వం కుప్పకూలింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తాలిబన్లు ఎటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా? అనే సందేహం అందరి మదిలోనూ మెదులుతోంది. ఈ నేపథ్యంలో అఫ్గానిస్తాన్ లో ప్రజాస్వామ్య వ్యవస్థ అస్సలు ఉండబోదని తాలిబన్లు ప్రకటించారు. ఇక్కడ పాలక మండలి పరిపాలన సాగిస్తుందని తెలుస్తోంది. 

తాలిబన్ల అధినాయకుడు హైబతుల్ల అఖుంద్ జాదా నేతృత్వంలో ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఏర్పడనుందని తాలిబన్లకు చెందిన ఒక సీనియర్ నాయకుడు చెప్పాడు. అఫ్టాన్ సాయుధ దళాలకు చెందిన మాజీ పైలట్లు, సైనికలును తమ ప్రభుత్వంలోకి తాలిబన్లు ఆహ్వానించనున్నారట. 

ఈ విషయాన్ని తాలిబన్లు పెద్దలతో సంబంధాలున్న వహీదుల్లా హషిమి వెల్లడించారు. అయితే ఇలా ఎంతమంది తాలిబన్ ప్రభుత్వంలో చేరతారనేది ప్రశ్నార్థకంగా మారింది. 20 ఏళ్లుగా తాలిబన్లు వేలాదిమంది అఫ్ఘాన్ సైనికులను మట్టుబెట్టారు. ఇటీవల కాలంలో యూఎస్ నుంచి శిక్షణ పొంది అఫ్ఘాన్ పైలట్లను వాళ్లు టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. 

తాలిబన్లు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ విధానం అవుట్ లైన్ ను హషిమి తెలిపారు. ఇది 1996-2001 మధ్య తాలిబన్ల ప్రభుత్వానికి చాలా దగ్గరగా ఉంది. అప్పట్లో తాలిబన్ల అధినాయకుడు ముల్లా ఒమర్ తెరమాటున ఉండి, దేశంలో రోజువారీ కార్యకలాపాలను ఒక పాలకమండలికి వదిలేశారు.

ఇప్పుడు కూడా పాలక మండలి ఏర్పాటు చేస్తారని, ఈ మండలిపైన అఖుంద్ జాదా ఉంటారని, ఒక విధంగా ఆయన దేశాధ్యక్షుడి హోదా కలిగి ఉంటారని హషిమి వివరించారు. అఖుంద్ జాదా డిప్యూటీ ‘అధ్యక్ష’ పదవిలో ఉండొచ్చని హషిమి అభిప్రాయపడ్డారు. ప్రస్తు తాలిబన్ అధినాయకుడికి వద్దముగ్గురు డిప్యూటీ లీడర్లున్నారు. 

పాకిస్తాన్‌లో దారుణం : యువతిపై 400 మంది మూకుమ్మడి దాడి.. బట్టలు చించి, నగ్నంగా తిప్పిన అల్లరి మూక

వాళ్లు ముల్లా ఒమర్ కుమారుడు మావ్లావి యూకూబ్, ఉగ్రవాదులకు చెందిన శక్తిమంతమైన హక్కానీ నెట్ వర్క్ నాయకుడు సిరాజుద్దీన్ హక్కానీ, తాలిబన్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అబ్దుల్ ఘనీ బారాడర్. దోహాలోని తాలిబన్ పొలిటికల్ ఆఫీసు ఘనీ ఆధీనంలోనే పనిచేస్తుంది. 

కాగా, ఆప్ఘనిస్తాన్  పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఆ దేశాన్ని తాలిబాన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. తాలిబాన్లు.. రాజధాని కాబూల్ చేరుకునే సమయానికే.. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘని పరారయ్యాడనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాతి రోజు.. ఆయన పారిపోతూ డబ్బుల సంచులతో వెళ్లిపోయాడంటూ వార్తలు వచ్చాయి. అయితే.. ఆ వార్తలపై తాజాగా అష్రఫ్ ఘని స్పందించారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో ఓ వీడియోని షేర్ చేశారు. 

అఫ్ఘానిస్థాన్ దేశం నుంచి పారిపోయే ముందు దేశ నిధుల నుంచి 169 మిలియన్ డాలర్లను దొంగిలించి తీసుకెళ్లానని రష్యా దేశ దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యలను ఘనీ ఖండించారు. తాను యునైటెడ్ ఎమిరేట్స్ లో ఉన్నానని ఘనీ ధ్రువీకరించారు. తాను తాలిబాన్ల నుంచి తప్పించుకునేందుకు సంప్రదాయ బట్టలు, ఒక చొక్కా మాత్రమే ధరించానని.. కనీసం చెప్పులు కూడా తీసుకువెళ్లలేదని ఆయన పేర్కొన్నారు.

తాను డబ్బు తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయని, ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఘని వీడియోలో వివరించారు.తాను నాలుగు కార్లు, హెలికాప్టరు నిండా నగదుతో కాబూల్ నుంచి పారిపోయానని రష్యా రాయబారి చేసిన ఆరోపణలను ఘనీ కొట్టివేశారు. తాను డబ్బుతో పారిపోయాననేది అబద్ధమని.. దీన్ని యూఏఈ కస్టమ్స్ అధికారులతోనూ ధ్రువీకరించుకోవచ్చని ఘని చెప్పారు. దేశాధినేతగా తనకున్న ముప్పతో పారిపోయానని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios