రేప్ కేసు నిందితుడు, అజ్ఞాతంలో ఉంటూ తన సొంత దేశాన్నే ఏర్పటు చేసుకున్న నిత్యానంద.... తాజాగా తన దేశానికి ఒక రిజర్వు బ్యాంకు ను ఏర్పాటు చేసుకున్నట్టుగా ప్రకటించాడు. తన కైలాస దేశానికి రెసెర్బ్ బ్యాంకు అఫ్ కైలాస ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఒక వీడియో ద్వారా తెలిపాడు. 

ఆయన కైలాస దేశం, మరో దేశంతో ఒప్పందం కుడుచుకుందని, ఆ ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఈ రిజర్వు బ్యాంకును ఏర్పాటుచేసి, దీని కార్యకలాపాలను చూసుకుంటుందని దీని పేరు హిందూ ఇన్వెంస్ట్మెంట్ అండ్ రిజర్వు బ్యాంకుగా ప్రకటించాడు. 

వినాయక చవితి సందర్భంగా ఈ బ్యాంకును లాంచ్ చేయనున్నట్టు తెలిపాడు. బ్యాంకు ఎలా నడుచుకుంటుంది, దీని తీరుతెన్నులు, కరెన్సీకి సంబంధించిన 300 పేజీల డాక్యుమెంట్ సిద్ధంగా ఉందని తెలిపాడు. 

ఇప్పటికే సొంత జెండా రిషభ ధ్వజ, ను ప్రకటించిన నిత్యానంద ఇప్పుడు ఏకంగా బ్యాంకును ప్రారంభిస్తున్నట్టు తెలిపాడు. ఈ దేశానికి ఇంగ్లీష్, సంస్కృతం, తమిళ్ అధికారిక భాషలని నిత్యానంద తన వెబ్ సైట్ లో పేర్కొన్నాడు. 

హిందూ భక్తుల పెట్టుబడులకు ఒక ఆవాసం కల్పించడానికి ఈ బ్యాంకును ఏర్పాటు చేశామని, ప్రపంచంలోని హిందువులంతా ఏ బ్యాంకులో పెట్టుబడులు పెడతారని ఈ సందర్భంగా నిత్యానంద పేర్కొన్నాడు. 

ట్రస్టు ద్వారా ఈ బ్యాంకును నిర్వహిస్తామని, ప్రపంచంలోని హిందువులందరూ ఈ బ్యాంకులో పెట్టుబడులు పెట్టొచ్చని, దీని సభ్యులకు లోన్స్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. ఇందులో క్రిప్టో కరెన్సీ  ద్వారా లావాదేవీలు జగతాయని నిత్యానంద ప్రకటించారు.