Viral: న్యూజిలాండ్ యంగ్ లీడర్ పవర్‌ఫుల్ స్పీచ్ వైరల్.. స్థానిక తెగ భాషతో దద్దరిల్లిన పార్లమెంటు
న్యూజిలాండ్ పార్లమెంటులో ఓ యంగ్ లీడర్ దద్దరిల్లించింది. 21 ఏళ్ల ఎంపీ హానా రాహితి మైపి క్లార్క్ స్థానిక తెగ భాషలో పార్లమెంటు మాట్లాడారు. గతేడాది అక్టోబర్‌లో తనను పార్లమెంటుకు గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. వారి హక్కుల కోసం తన సంకల్పాన్ని వివరించారు.
New Zealand: న్యూజిలాండ్ పార్లమెంటులో చిన్న వయస్కురాలైన ఎంపీ చేసిన శక్తివంతమైన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. న్యూజిలాండ్ స్థానిక తెగల హక్కుల కోసం పోరాడుతున్న ఆమె వారి గళాన్నే పార్లమెంటులో ఎత్తారు. స్థానిక తెగ భాషలో ఆమె పార్లమెంటులో ఊగిపోతూ ప్రసంగించారు. ఇతరులూ ఆమె ప్రసంగంతో ఉర్రూతలూగారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.
న్యూజిలాండ్ 170 ఏళ్ల చరిత్రలో అతి చిన్న వయసు ఎంపీగా హానా రాహితి మైపి క్లార్క్ (21 ఏళ్లు) రికార్డు సృష్టించారు. ఆమె హరాకి వైకటో స్థానం నుంచి గతేడాది అక్టోబర్‌లో గెలుపొందారు. 2008 నుంచి అప్పటి వరకు నానయా మహుతా ఆ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. న్యూజిలాండ్ మోస్ట్ సీనియర్ ఎంపీ మహుతానే. కానీ, ఆ ఎంపీ స్థానంలో ఇప్పుడు యంగ్ లీడర్ హానా రాహిత క్లార్క్ పార్లమెంటులో అడుగుపెట్టారు.
తనను గెలిపించిన ఓటర్ల ప్రయోజనాలకు కట్టుబడి ఉంటానని, వారి హక్కుల కోసం చావడానికైనా సిద్ధం అని, వారి హక్కుల కోసమే జీవిస్తానని తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఆమె ఉద్వేగ భరిత ప్రసంగం తుఫానుల గంభీరంగా ఉన్నది.
New Zealand natives' speech in parliament pic.twitter.com/OkmYNm58Ke
— Enez Özen | Enezator (@Enezator) January 4, 2024
న్యూజిలాండ్ హెరాల్డ్ ప్రకారం, తమారికి మావోరి పిల్లలు క్లాస్ రూముల్లో సంవత్సరాల కొద్ది కూర్చుంటున్నారని, వారి స్థానిక భాష కోసం తంటాలు పడుతున్నారని ఆమె వివరించారు. ఇంకా వారి మూలాల గురించి తెలియని వారిని అవే మూలాలు చేతులు చాచి స్వాగతిస్తున్నాయని అన్నారు. వారు ఏ తొడుగు ధరించాల్సిన అవసరం లేదని, మరే విధంగా తమను తాము మార్చుకోవాల్సిన పని లేదని తెలిపారు. వారంతా పర్ఫెక్ట్‌గానే ఉన్నారని పేర్కొన్నారు.
Also Read: Sonia Gandhi: ఖమ్మం నుంచి లోక్ సభ బరిలో సోనియా గాంధీ.. సౌత్ మిషన్‌లో భాగమేనా?
ది గార్డియన్ ప్రకారం, ఆమె తనను తాను ఒక రాజకీయ నాయకురాలిగా చూసుకోదు. మావోరి భాషకు సంరక్షురాలిగా భావిస్తుంది. మావోరి నూతన తరాల భాషను, వారి గళాలను బయటి ప్రపంచం వినాల్సి ఉన్నదని అనుకుంటుంది.