Asianet News TeluguAsianet News Telugu

చైనాలో మరో వైరస్: ఏడుగురి మృతి, 60 మందికి అస్వస్థత

చైనాలో మరో వైరస్ కారణంగా ఏడుగురు మరణించారు. 60 మంది అస్వస్థతకు గురయ్యారు. సివియ‌ర్ ఫీవ‌ర్ విత్ త్రామ్‌బోసిటోపెనియా సిండ్రోమ్(ఎస్ఎఫ్‌టి)గా దీన్ని పిలుస్తారు.

New Virus Alert: 7 Dead, 60 Infected in China, Tick Bite is Transmission Route
Author
Beijing, First Published Aug 6, 2020, 4:38 PM IST

బీజీంగ్: చైనాలో మరో వైరస్ కారణంగా ఏడుగురు మరణించారు. 60 మంది అస్వస్థతకు గురయ్యారు. సివియ‌ర్ ఫీవ‌ర్ విత్ త్రామ్‌బోసిటోపెనియా సిండ్రోమ్(ఎస్ఎఫ్‌టి)గా దీన్ని పిలుస్తారు.

తూర్పు చైనాలోని జియాంగ్స్  ఫ్రావిన్సులో ఎస్ఎఫ్‌టి వైరస్ బారిన 37 మంది పడ్డారు. ఈ ఏడాది మొదట్లో వీరంతా వైరస్ బారిన పడినట్టుగా  చైనా ప్రకటించింది. ఆ తర్వాత మరో 23 మందికి కూడ ఈ వైరస్ వ్యాపించిందని ఆ దేశం ప్రకటించింది. చైనాకు చెందిన అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఈ విషయాన్ని ప్రకటించింది.

జియాంగ్స్ రాష్ట్ర రాజధాని నన్ గ్జింగ్ లో ఓ మహిళకు ఈ వైరస్ సోకింది.  జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో ఆమె బాధపడింది. దీంతో ఆమె నుండి రక్త నమూనాలను పరీక్షిస్తే ల్యూకో సైట్, బ్లడ్ ప్లేట్ లెట్లు క్షిణించినట్టుగా వైద్యులు గుర్తించారు. నెల రోజుల చికిత్స తర్వాత ఆమె కోలుకొంది.

అనువుయిలో ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ఏడుగురు మరణించారు.  ఎస్ఎఫ్ టి కొత్త వైరస్ కాదని చైనా చెబుతోంది. 2011లోనే దీన్ని గుర్తించారు.చైనాతో పాటు కొరియా, జపాన్ లలో ఈ తరహా కేసులు వెలుగు చూశాయి. కరోనా తరహలోనే ఈ వైరస్ సోకిన వారిలో కూడ జ్వరం, దగ్గు లక్షణాలు తీవ్రంగా కన్పిస్తాయి. ఈ వైరస్ తో 10 నుండి 16 శాతం మంది మరణిస్తారని గణాంకాలు చెబుతున్నాయి. మనిషి నుండి మనిషికి ఈ వైరస్ సంక్రమించే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios