Asianet News TeluguAsianet News Telugu

మరోసారి వివాదాల్లో చిక్కుకున్న మైక్ టైసన్‌.. 5 మిలియన్ డాలర్లు డిమాండ్ చేస్తూ దావా..  

ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్, మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ 1990ల ప్రారంభంలో తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ ఆరోపించింది. మహిళ తన అఫిడవిట్‌లో సంఘటన తేదీని పేర్కొననప్పటికీ, 1990ల ప్రారంభంలో అత్యాచారం జరిగిందని ఆరోపించింది.

New US Rape Lawsuit Filed Against Boxer Mike Tyson
Author
First Published Jan 26, 2023, 1:41 AM IST

ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్,హెవీవెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ మరోసారి వార్తల్లో నిలిచారు. 1990ల ప్రారంభంలో తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. మహిళ ఫిర్యాదు ప్రకారం.. టైసన్ ఆల్బనీ నైట్‌క్లబ్‌లో కలిసిన తర్వాత తనపై లిమోసిన్‌లో అత్యాచారం చేశాడని, ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా గాయపడ్డాడని ఆరోపించింది. ఈ సంఘటన కారులో జరిగిందని కాథిక్ మహిళ పేర్కొంది. ఈ మేరకు 5 మిలియన్ అమెరికన్ డాలర్లు డిమాండ్ చేసింది.

అయితే మహిళ దాఖలు చేసిన ఫిర్యాదు అఫిడవిట్‌లో తేదీ పేర్కొనలేదు. ఇది కేవలం 1990ల ప్రారంభంలో జరిగిందని పేర్కొంది. పాత వార్తల ప్రకారం..  అదే సమయంలో, ఇండియానాపోలిస్‌లో టైసన్ తనపై అత్యాచారం చేశాడని డిసైరీ వాషింగ్టన్ అనే మహిళా మోడల్ కూడా ఆరోపించింది. ఫిబ్రవరి 10, 1992న, టైసన్ వాషింగ్టన్‌పై అత్యాచారం చేసినందుకు మూడేళ్ల జైలుశిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది.

తాజా కేసు గురించి మాట్లాడుతూ.. ఆరోపించిన మహిళ తన ఫిర్యాదులో తాను టైసన్ కారు కారులో ఎక్కినప్పుడు, టైసన్ తనను అనుచితంగా తాకడం ప్రారంభించాడని, ముద్దు పెట్టుకోవడానికి కూడా ప్రయత్నించాడని పేర్కొంది. అలాంటి చేష్టలను ఆపాలనీ,  అతనికి చాలాసార్లు చెప్పనని, అతన్ని ఆపడానికి ప్రయత్నించానని, కానీ టైసన్ తనపై దాడి చేస్తూనే ఉన్నాడని మహిళ తెలిపింది. ఆపై అత్యాచారం చేశాడని పేర్కొంది. 

ఆ మహిళ తన పేరు దాచాలని కోరింది. బాధితురాలు ప్రకారం.. తనపేరు బయటపెడితే, అది తన మానసిక స్థితిని మరింత దిగజార్చవచ్చనీ, అలాగే.. వ్యక్తిగత వేధింపులకు గురికావలసి ఉంటుందని పేర్కొంది.  అయితే.. మహిళ ఆరోపణలను  తాను నమ్మడం లేదని మహిళ తరపు న్యాయవాది డారెన్ సీల్‌బాచ్ ప్రత్యేక ప్రకటనలో తెలిపారు. అయితే ఆ ఆరోపణలపై విచారణ జరిపినప్పుడు అవి చాలా వరకు నిజమని తేలిందని అన్నారు. హెవీవెయిట్ ఛాంపియన్ టైసన్ రింగ్ వెలుపల జీవితం ఎప్పుడూ వివాదాలతో కూడుకున్నది. అతని మాజీ భార్య , నటి రాబిన్ గివెన్స్ కూడా విడాకుల సమయంలో టైసన్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి.

Follow Us:
Download App:
  • android
  • ios