బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్త కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతూ గడగడలాడిస్తోంది. అయితే కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు ఈ నూతన రకం వ్యాప్తి అదుపు తప్పలేదని స్పష్టం చేసింది.
బ్రిటన్ లో వెలుగులోకి వచ్చిన కొత్త కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతూ గడగడలాడిస్తోంది. అయితే కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు ఈ నూతన రకం వ్యాప్తి అదుపు తప్పలేదని స్పష్టం చేసింది.
అంతేకాదు కరోనా కట్టడికి మొదటినుంచి ఏ విధానాలైతే పాటిస్తున్నామో వాటినే మరింత జాగ్రత్తగా పాటిస్తే ఈ కొత్తరకం వైరస్ ను కూడా నియంత్రించవచ్చని వివరించింది. ఈ కొత్తరకం కరోనా వైరస్ కంటే భారీస్థాయి విజృంభణను గతంలో చూశామని, దానితో పోలిస్తే దీని వ్యాప్తి అదుపు తప్పలేదని చెప్పవచ్చని అభిప్రాయపడింది.
అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కరోనా నిబంధనల్ని పాటించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అజాగ్రత్త వహిస్తే ప్రమాదం తప్పకపోవచ్చునని హెచ్చరించింది.
ప్రస్తుతం కరోనా కట్టడికి మనం అమలు చేస్తున్న నింబధనలనే మరింత జాగ్రత్తగా పాటిస్తూ, దీర్ఘ కాలం అనుసరించాలి. అప్పుడే కొత్త రకం కరోనా వ్యాప్తిని అదుపులో పెట్టవచ్చు. కొన్ని విషయాల్లో మరింత కఠినంగా ఉండాల్సిన అవసరముందని డబ్లూహెచ్ వో ఎమర్జెన్సీ ఆపరేషన్స్ హెడ్ మైఖేల్ ర్యాన్ అభిప్రాయపడ్డారు.
రూపు మార్చుకున్న ఈ కొత్త వైరస్ ప్రస్తుతానికి బ్రిటన్ తోపాటు మరో 4-5 దేశాల్లో వెలుగు చూసింది. అయితే కొత్త రకం కరోనావైరస్ ఇంతకుముందు వైరస్ తో పోలిస్తే 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందన్న వార్త ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తోంది. ముఖ్యంగా బ్రిటన్ పేరెత్తితేనే అంతర్జాతీయ సమాజం వణికిపోతోంది. భారత్ సహా అనేక దేశాలు ముందు జాగ్రత్త చర్యగా ఆ దేశానికి విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 22, 2020, 12:46 PM IST