Asianet News TeluguAsianet News Telugu

నేపాల్ పార్లమెంట్‌ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం: వచ్చే ఏడాది ఏప్రిల్, మేలో ఎన్నికలు

 పార్లమెంట్ రద్దుకు ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని కేబినెట్ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి బింద్యాదేవి బండారి ఆదివారం నాడు ఆమోదించారు.  వచ్చే ఏడాది ఏప్రిల్- మే మాసంలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి.

Nepals President dissolves Parliament announces midterm polls lns
Author
Kathmandu, First Published Dec 20, 2020, 6:02 PM IST

ఖాట్మాండ్: పార్లమెంట్ రద్దుకు ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని కేబినెట్ చేసిన సిఫారసుకు రాష్ట్రపతి బింద్యాదేవి బండారి ఆదివారం నాడు ఆమోదించారు.  వచ్చే ఏడాది ఏప్రిల్- మే మాసంలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి.

నేపాల్  పార్లమెంట్ రద్దుకు సిఫారసు చేస్తే కేపీ శర్మ ఓలి కేబినెట్ సిఫారసు చేసింది. నేపాల్ రాష్ట్రంలో వచ్చే ఏడాది ఏప్రిల్, మే మాసంలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా రాష్ట్రపతి ప్రకటించారు.

also read:నేపాల్‌ ప్రధాని సంచలనం: పార్లమెంట్ రద్దుకు సిఫారసు

వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీన మొదటి విడత, మే 10 వ తేదీన రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు.  పార్లమెంట్ ను రద్దు చేస్తున్నట్టుగా రాష్ట్రపతి ఆదివారం నాడు సాయంత్రం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఆర్టికల్ 76 లోని క్లాస్ 1, 7 తో పాటు ఆర్టికల్ 85 ప్రకారం పార్లమెంట్ ను రద్దు చేసినట్టుగా రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. 

పార్లమెంట్  లో 275 మంది సభ్యుల ప్రతినిధుల సభ 2017లో ఎన్నికైంది.  పాలకవర్గ పార్టీయైన ఎన్‌సీపీలో  చోటు నేతల మధ్య వైరం చోటు చేసుకొంది. రెండు వర్గాల మధ్య నెలల తరబడి గొడవలు చోటు చేసుకొంటున్నాయి.  ప్రధాని పీఠం కోసం పార్టీలో అగ్రనేతలు పరస్పరం విమర్శించుకొంటున్నారు. 

ప్రధాని కేపీశర్మ ఓలి, పార్టీ చైర్మెన్ ప్రచండ నేతృత్వంలో మరో వర్గం పరస్పరం విమర్శలు  చేసుకొంటున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios