Vaccination Cards : ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో తిరుగాలంటే.. వ్యాక్సినేషన్ కార్డ్‌లను( రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి ఇవ్వబడేది) తప్పనిసరి చేసింది నేపాల్ సర్కార్.
Vaccination Cards : ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వందలాది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉంటే.. మరో వైపు ఒమిక్రాన్ కూడా శరవేగంగా విస్తరిస్తోంది. ఈ వేరియంట్ కేసులు కూడా భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు దేశాలు అంక్షాలను కఠినతరం చేస్తోన్నాయి. పర్యటక ప్రదేశాల్లో నిషేధాన్ని విధించాయి. ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, మాస్కులు తప్పని సరి చేశాయి. కరోనా బారిన పడకుండా ఉండాలంటే.. వ్యాక్సినేషన్ నే సరైన మార్గమని ప్రపంచ దేశాలు భావిస్తోన్నాయి.
ఈ క్రమంలో నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో తిరుగాలంటే.. వ్యాక్సినేషన్ కార్డ్‌లను( రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి ఇవ్వబడేది) తప్పనిసరి చేసింది నేపాల్ సర్కార్. జనవరి-17 నుంచి బహిరంగ ప్రదేశాల్లోతిరుగాలంటే.. (ఆఫీసులు,హోటల్స్,సినిమా థియేటర్లు, పార్కులు వంటివి) వ్యాక్సినేషన్ కార్డ్‌లు తప్పనిసరి చేశారని నేపాల్ లోని కోవిడ్ మేనేజ్ మెంట్ సెంటర్ ప్రతినిధి సునితా నేపాల్ తెలిపారు.
ఇక,నేపాల్‌లో గత 24 గంటల్లో 841 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 832,589కి చేరింది. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య 11,604కి చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,755గా ఉంది. నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇప్పటివరకు 814,230 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు. దీంతో నేపాల్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.
నేపాల్‌లో క్రమంగా కేసులు పెరుగుతుండటంలో ఆంక్షాలను కఠినతరం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో
25 మంది కంటే.. ఎక్కువ మంది బహిరంగ ప్రదేశాల్లో సమావేశం కావడం నిషేధించింది. అలాగే.. జనవరి 29 వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది అక్కడి సర్కార్. పాఠశాలలు మూతపడటంతో, 12-17 సంవత్సరాల మధ్య వయస్సు గల విద్యార్థులకు వ్యాక్సిన్‌లను చేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, సినిమా హాళ్లు, స్టేడియంలు మరియు దేశీయ విమానాలు వంటి బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి టీకా కార్డులను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఈ నిబంధన జనవరి 17 నుండి అమలులోకి వస్తుంది. నేపాల్ పొరుగుదేశమైనా.. భారతదేశంలో కోవిడ్ కేసుల పెరుగుదలను చూస్తోంది, దీంతో సరిహద్దులోనే పరీక్షలు నిర్వహించాలని అవసరమైన ఏర్పాట్లు చేశారు అధికారులు.
దీని ప్రకారం, దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలలో విమానాల రద్దీని తగ్గించడానికి సాంస్కృతిక, పర్యాటక ,పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయబడింది. ఇప్పటికే .. దక్షిణాఫ్రికా, బోట్స్వానా, జింబాబ్వే, నమీబియా, లెసోతో, ఈశ్వతిని, మొజాంబిక్, మలావి, హాంకాంగ్ నుండి వచ్చే ప్రయాణీకులకు క్వారంటైన్ తప్పనిసరి చేసింది.
భారత్ లో కోవిడ్ నేపథ్యంలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా భారత పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే.. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ సదస్సును గుజరాత్ ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో నేపాల్ ప్రధాని భారత పర్యటన వాయిదాపడింది.
