ఎయిడ్స్..  ఈ పేరు తెలియనివారు దాదాపుగా భూమ్మీద ఎవ్వరూ ఉండరు. ఏటా ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపు అన్ని దేశాలను వణికిస్తున్న ఎయిడ్స్‌కు మందు లేదు.

దీనిని నివారించాలని ఎంతో మంది శాస్త్రవేత్తలు ఏళ్లుగా ప్రయోగాలు చేస్తున్నారు. కానీ క్షణాల్లో రూపం మార్చుకుంటూ శాస్త్రవేత్తలకు హెచ్ఐవీ వైరస్ సవాలు విసురుతోంది.

ఈ నేపథ్యంలో అమెరికాలోని నెబ్రాస్కా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఎయిడ్స్‌కు మందు కొనగొనడంలో విజయం సాధించారు. టెంపుల్ యూనివర్సిటీత, నెబ్రాస్కా యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌ల శాస్త్రవేత్తలు క్రిస్పర్ క్యాస్-9 టెక్నాలజీతో హెచ్ఐవీ వైరస్‌లను తొలగించే ప్రయత్నం మొదలుపెట్టారు.

2014లో టెంపుల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనలో మానవ కణాల జన్యువుల్లోంచి వైరస్‌ను తొలగించడంలో విజయం సాధించారు. వీరి తర్వాత నెబ్రాస్కా యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో కలిసి బతికున్న జంతువులపై ప్రయోగాలు చేశారు.

వ్యాధితో కూడిన ఎలుకలకు యాంటీ రెట్రో వైరల్  మందులను చాలా నెమ్మదిగా వారాల పాటు విడుదల చేస్తూ వైరస్ మోతాదును అతి తక్కువ స్థాయిలో ఉండేలా చేసిన శాస్త్రవేత్తలు.. ఆ తర్వాత కణాల లోపల ఉండే వైరస్ డీఎన్ఏ పొగును కత్తిరించారు.

ఆ తర్వాత జరిపిన పరిశీలనలో సుమారు మూడు వంతుల ఎలుకల్లో వైరస్ లేకుండా పోయినట్లు స్పష్టమైంది.