'చంద్రుడిపై భారత్ కాలిమోపితే.. పాకిస్థాన్ అడుక్కుంది': భారత్ పై పాక్ మాజీ ప్రధాని ప్రశంసలు
Nawaz Sharif: భారతదేశంపై పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రశంసలు కురిపించారు. భారత్ చంద్రునిపైకి చేరుకోవడం, జీ 20 వంటి ప్రతిష్టాత్మక సదస్సుకు ఆతిథ్యమిస్తుంటే.. తమ దేశం (పాకిస్థాన్) ప్రపంచాన్ని అడుక్కుంటోందని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపించారు.

Nawaz Sharif: భారత్ పై పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రశంసలు కురిపించారు. భారతదేశం చంద్రుడిపై అడుగుపెట్టడం, జీ 20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తుంటే.. పాకిస్థాన్ మాత్రం ప్రపంచాలను అడుక్కుంటుందని అన్నారు. జి20ని అద్భుతంగా నిర్వహించడం ద్వారా భారత్ తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిందని కొనియాడారు. సోమవారం లండన్ నుంచి పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్ (పీఎంఎల్-ఎన్) సమావేశంలో ప్రసంగిస్తూ పార్టీ అధినేత నవాజ్ పై విషయాలు తెలిపారు. 1990లో ప్రభుత్వం ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలను భారత్ అనుసరించిందని, నేడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని మాజీ ప్రధాని నవాజ్ అన్నారు.
దుస్థితికి సైన్యమే కారణం
అటల్ బిహారీ వాజ్‌పేయి భారత ప్రధాని అయ్యాక భారత్ వద్ద కేవలం ఒక బిలియన్ డాలర్ల విదేశీ మారకద్రవ్య నిల్వలు ఉండేవని, ఆ సమయంలో తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల ఇప్పుడు భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు 600 బిలియన్ డాలర్లకు చేరిందని అన్నారు. భారత్ ఉన్నత స్థాయికి చేరుకుంటే.. పాకిస్తాన్ మాత్రం మరొక దేశాన్ని యాచిస్తూనే ఉందని అన్నారు. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభానికి దేశ మాజీ ఆర్మీ జనరల్ , కోర్టు న్యాయమూర్తులు బాధ్యులని నవాజ్ ఆరోపించారు.
లీటరు పెట్రోల్ ధర రూ 1000 లకు చేరేది..
పీఎంఎల్-ఎన్ సంకీర్ణ ప్రభుత్వం దేశాన్ని దివాళా తీయకుండా కాపాడి ఉండకపోతే.. ప్రస్తుతం పెట్రోల్ లీటరు రూ.1000కు విక్రయించబడేదని మాజీ ప్రధాని నవాజ్ అన్నారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.330 (పాకిస్థానీ)గా ఉంది. అక్టోబరు 21న పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లి వచ్చే ఎన్నికల్లో పార్టీకి నాయకత్వం వహించేందుకు తాను ఉత్సాహంగా ఉన్నానని నవాజ్ తెలిపారు.
నవంబర్ 2019లో అల్ అజీజియా మిల్స్ అవినీతి కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న షరీఫ్, వైద్య కారణాలతో దేశం విడిచి వెళ్లేందుకు అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా సహాయం చేశారు. వచ్చే నెలలో లాహోర్‌కు రాకముందే అతనికి బెయిల్ మంజూరు చేస్తామని PML-N చెబుతోంది. తిరిగి రాగానే ఆయన పార్టీ చారిత్రాత్మక స్వాగతం పలికేందుకు ప్లాన్ చేసింది.
షరీఫ్ 2017లో సైనిక , న్యాయవ్యవస్థ స్థాపనపై విరుచుకుపడ్డారు, వారిని ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఇంటికి పంపడానికి అతను బాధ్యత వహించాడు.అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, అప్పటి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ తన తొలగింపు వెనుక ఉన్నారని ఆయన అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని షరీఫ్ ప్రకటించారు.