Asianet News TeluguAsianet News Telugu

Naveen Srivastava: నేపాల్‌లో భారత నూత‌న రాయబారి నియ‌మ‌కం.. ఇక చైనా చ‌ర్య‌ల‌కు చెక్!

Naveen Srivastava: నేపాల్‌లో భారత కొత్త రాయబారిగా నవీన్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ఆయ‌న ప్ర‌స్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తూర్పు ఆసియా విభాగానికి అధిపతిగా ఉన్నారు. వినయ్ కవాత్రా స్థానంలో నవీన్ శ్రీవాస్తవ ప‌దవీ బాధ్య‌తలు చేప‌ట్ట‌నున్నారు. 
 

Naveen Srivastava Appointed As India's Ambassador To Nepal
Author
Hyderabad, First Published May 17, 2022, 10:49 PM IST

Naveen Srivastava: నేపాల్‌లో నూత‌న‌ భారత రాయబారిగా నవీన్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. నవీన్ శ్రీవాస్తవ ప్రస్తుతం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారని, నేపాల్‌లో తదుపరి భారత రాయబారిగా నియమితులయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. శ్రీవాస్తవ 1993 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించవచ్చు. చైనాను ఎదుర్కోవడానికి ఈ చర్య ముఖ్యమైన వ్యూహంగా పరిగణించబడుతుంది.

నవీన్ శ్రీవాస్తవ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తూర్పు ఆసియా విభాగానికి అధిపతిగా ఉన్నారు. 2020 నుండి కొనసాగుతున్న ప్రతిష్టంభన విషయంలో చైనాతో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)పై దౌత్య, సైనిక చర్చలలో  ఆయ‌న ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చ‌ర్య‌తో చైనా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాల్సి  వచ్చింది.

తూర్పు ఆసియా విభాగానికి అధిపతి

ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ పర్యటన సందర్భంగా మే 16న  నేపాల్‌లో భారత రాయబారిగా నవీన్ శ్రీవాస్తవను నియమిస్తూ భారతదేశం అధికారికంగా నిర్ణయం తీసుకుంది. వినయ్ కవాత్రా స్థానంలో నవీన్ శ్రీవాస్తవ బాధ్య‌తలు చేప‌ట్ట‌నున్నారు. చైనా, జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, మంగోలియా వ్యవహారాలను చూసే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని తూర్పు ఆసియా విభాగానికి నవీన్ శ్రీవాస్తవ నేతృత్వం వహిస్తున్నారు.

నవీన్ శ్రీవాస్తవ చైనా వ్యవహారాల్లోనూ నిపుణుడిగా పరిగణిస్తారు. నేపాల్‌లో భారత రాయబారిగా శ్రీవాస్తవ నియామకం చైనాను ఎదుర్కోవటానికి భారతదేశం వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు. నవీన్ శ్రీవాస్తవ సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (WMCC) సమావేశాలలో కూడా పాల్గొన్నారు. దీనితో పాటు, LAC పై కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య ఆయ‌న‌ భారత్,  చైనా సైనిక కమాండర్ల మధ్య జ‌రిగిన‌ సమావేశాలకు కూడా హాజరయ్యాడు.

 నేపాల్‌లో ప్రధాని మోదీ పర్యటన‌

నవీన్ శ్రీవాస్తవ షాంఘైలో కాన్సుల్ జనరల్‌గా  కూడా నియమితులయ్యారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. నేపాల్‌ను ప్ర‌ధాన‌ పొరుగు దేశంగా పేర్కొంటూ, రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసిందని మంగళవారం అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios