అమెరికాలోని ఓ హైవే మీద ఓ మహిళ హల్ చల్ చేసింది. నగ్నంగా కారులోంచి దిగి.. ఇతర వాహనాలపై కాల్పులు జరిపింది. 

అమెరికా : శాన్ ఫ్రాన్సిస్కో-ఓక్‌లాండ్ బే బ్రిడ్జిపై రద్దీ సమయంలో ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. నగ్నంగా ఉన్న ఓ మహిళ అకస్మాత్తుగా తన కారులోంచి దిగి, అటుగా ప్రయాణిస్తున్న కార్లపై తుపాకీతో కాల్చడం ప్రారంభించింది. ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని, మహిళను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

కాలిఫోర్నియా హైవే పాట్రోల్‌కి సాయంత్రం 4.40 గంటలకు ఇంటర్‌స్టేట్ 80లో ఒక నిర్లక్ష్యపు డ్రైవర్ ఇతర డ్రైవర్లకు తుపాకీని చూపిస్తూ.. 911 కాల్‌ వచ్చింది. ఓ వీధి గుండా వెడుతున్న మహిళ వీధి మధ్యలో ఆగి, కత్తితో కారులోంచి దిగి కేకలు వేయడం ప్రారంభించింది. ఆ తర్వాత మహిళ కారులోకి ఎక్కి టోల్ ప్లాజా వద్దకు వెళ్లింది. అక్కడ బట్టలు విప్పి మళ్లీ తుపాకీతో కారు దిగింది.

"అటుగా వెడుతున్న ఇతర వాహనాలపై కేకలు వేస్తూ..గాలిలోకి కాల్పులు జరపడం ప్రారంభించింది. దీంతో ఆ వాహనదారులు ఏం జరుగుతుందో తెలియక తికమక పడ్డారు. యాక్సిడెంట్ అయ్యిందేమో అనుకుని చూడడానికి వెళ్లేసరికి... ఆ ఇతర వాహనాల వైపు కూడా ఆమె రౌండ్లు కాల్చడం ప్రారంభించింది"

ఆ మహిళ అక్కడికి వచ్చిన కార్లపై కాల్పులు జరపడం ప్రారంభించింది. కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ ప్రదేశానికి చేరుకుని ఆయుధాన్ని కిందకు దింపమని ఆ మహిళను కోరింది. కొద్దిసేపు అలా చేయడానికి నిరాకరించిన తర్వాత, ఆ మహిళ తన తుపాకీని కిందకి దింపి, పోలీసు కస్టడీలోకి వచ్చింది. స్థానిక ఆసుపత్రిలో మహిళ మానసిక ఆరోగ్యం విషయాలు ఇంకా వెల్లడించలేదన్నారు. 

ఆమెను విడుదల చేసిన తర్వాత ఈ ఆరోపణలపై మళ్లీ బుక్ చేస్తామని పోలీసులు తెలిపారు. దీంతో రోజుకు వేలాదిమంది ప్రయాణించే ఆ రోడ్డును గంటపాటు మూసేశారు.