Asianet News TeluguAsianet News Telugu

నగ్నంగా నడిబజార్లో నడక.. బట్టలు ఉతుక్కోవడానికి విప్పానంటూ...

మతిస్థిమితం లేనివారు కొన్నిసార్లు నగ్నంగా రోడ్లమీద కనిపిస్తుంటారు. వారికి బట్టలు సరిగా వేసుకోవడం రాకపోవడమో.. మానసిక సమస్యలతో.. మన ధ్యాసలో లేకపోవడం వల్లో  అలా చేస్తుంటారు. అయితే లండన్ లో ఓ వ్యక్తి మాత్రం సరదాగా ఒంటిమీద నూలు పోగు లేకుండా రోడ్ల మీద చక్కర్లు కొట్టారు. 

Naked Man Goes For a Run Amid Lockdown in London, Says He Took Off His Clothes to Wash Himself - bsb
Author
Hyderabad, First Published Jan 27, 2021, 3:51 PM IST

మతిస్థిమితం లేనివారు కొన్నిసార్లు నగ్నంగా రోడ్లమీద కనిపిస్తుంటారు. వారికి బట్టలు సరిగా వేసుకోవడం రాకపోవడమో.. మానసిక సమస్యలతో.. మన ధ్యాసలో లేకపోవడం వల్లో  అలా చేస్తుంటారు. అయితే లండన్ లో ఓ వ్యక్తి మాత్రం సరదాగా ఒంటిమీద నూలు పోగు లేకుండా రోడ్ల మీద చక్కర్లు కొట్టారు. 

నవ్వుకుంటే నాకేంటి సిగ్గు అనుకున్నాడేమో కానీ దిసమొలతో బజార్ల వెంట పరుగులు పెట్టాడు. అతన్ని, అతడి వాలకాన్ని చూసి లండన్ వాసులు షాక్ అయ్యారు. 'మై లండన్‌' పేర్కొన్న వివరాల ప్రకారం జనవరి 24న లండన్‌లో ఓ వ్యక్తి నగ్నంగా బ్రిటీష్‌ మ్యూజియమ్‌ చుట్టూ చక్కర్లు కొట్టాడు. 

ఆ చుట్టుపక్కల ప్రదేశంలో పరుగులు తీస్తూ జనాలను ఠారెత్తించాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగగా సదరు వ్యక్తి అక్కడ నుంచి పరారయ్యాడు.

ఈ ఘటన గురించి ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. 'సాయంత్రం 3.45 గంటల ప్రాంతంలో నేను రోడ్ల మీద వాకింగ్‌ చేస్తున్నాను. అప్పుడు ఓ వ్యక్తి నగ్నంగా నడుస్తూ తారసపడ్డాడు. అతడు పరుగులు పెడుతున్నట్లుగా వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. అక్కడున్న చాలామంది అతడిని చూసి షాకయ్యారు. ఓ గార్డెన్‌ వరకు వెళ్లిన అతడు తిరిగి మళ్లీ మ్యూజియం వైపు నడక సాగించాడు' అని చెప్పుకొచ్చాడు. 

మరో ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. 'ఎందుకీ అవతారంలో బయటకు వచ్చావని అతడిని అడిగాను. దానికతను జవాబిస్తూ.. నా బట్టలు ఉతుక్కోవడం కోసం ఒంటి మీదున్నవి తీసేశాను. ఆ తర్వాత కాసేపు అలా నడుద్దామని వచ్చానని చెప్పాడు' అని తెలిపాడు. రోడ్లపై బట్టలు లేకుండా ఇష్టారాజ్యంగా తిరిగిన సదరు వ్యక్తి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios