ఉక్రెయిన్ విమాన ప్రమాదంలో మిస్టరీ: ఇరాన్, అమెరికాపైనే అనుమానాలు..?

జనరల్ ఖాసీం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణీ దాడులు చేసిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోవడంతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

Mystery surrounds Ukrainian airliner Boeing 737 plane crash in Iran

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ ఎయిర్‌పోర్టుకు సమీపంలో బుధవారం చోటు చేసుకున్న విమాన ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనరల్ ఖాసీం సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణీ దాడులు చేసిన కొద్దిసేపటికే ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోవడంతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Also Read:ఇరాన్ లో ఘోర విమాన ప్రమాదం... 167మంది మృతి

ఇరాన్-అమెరికా వైమానిక దళాలు దీనిని పొరపాటున కూల్చివేశాయా...? అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో కూలిపోయిన విమానానికి చెందిన రెండు తబ్లాక్‌బాక్స్‌‌లను బోయింగ్ కంపెనీకి ఇచ్చేందుకు ఇరాన్ నిరాకరించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రమాదంపై ఉక్రెయిన్ స్పందిస్తూ.. ఇంజిన్ వైఫల్యం కారణంగానే విమానం కూలిందని తొలుత చెప్పింది. అయితే కొద్దిగంటల తర్వాత ఆ వ్యాఖ్యలను ఉక్రెయిన్ ఉపసంహరించుకుంది. ప్రమాదానికి గల కారణాన్ని ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు తర్వాతే ఒక అంచనాకు రాగలమని ఉక్రెయిన్ ప్రధానమంత్రి వెల్లడించారు.

మరోవైపు విమానాన్ని తయారు చేసిన బోయింగ్ కంపెనీ ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రెండు రోజుల ముందే దీనిని అన్ని రకాలుగా తనిఖీ చేశామని, అప్పుడు ఫ్లైట్‌లో ఎలాంటి సమస్యా లేదని తెలిపింది.

Also Read:సులేమానీ హత్యకు ప్రతీకారం: అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల దాడి

సదరు విమానాన్ని 2016లో తయారు చేసి.. నేరుగా ఫ్యాక్టరీ నుంచే ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్‌కు అందించామని వెల్లడించింది. విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగి కూలిపోయినట్లు వీడియో ఫుటేజీల్లో కనిపిస్తుండగా.. ఇరాన్ మాత్రం దీనిని తప్పుబడుతోంది. కుప్పకూలిన తర్వాతే మంటలు చెలరేగి ఆ తర్వాత పూర్తిగా కాలిపోయినట్లు ఇరాన్ అధికారులు చెబుతున్నారు. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 82 మంది ఇరానీయన్లే.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios