Asianet News TeluguAsianet News Telugu

ఆస్ట్రేలియన్ తీరానికి కొట్టుకవచ్చిన వింత వస్తువు.. అది చంద్రయాన్-3 రాకెట్ కి సంబంధించిదేనా..!?

ఆస్ట్రేలియాలోని సముద్ర తీరంలో  వింత (మిస్టీరియస్)వస్తువు ఒకటి కనిపించింది. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యపోవడంతో పాటు చర్చనీయాంశమైంది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్ బీచ్‌లో కనిపించిన సిలిండర్‌ లాంటి వస్తువును చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు.

Mysterious object washes up on Australian beach KRJ
Author
First Published Jul 17, 2023, 10:58 PM IST

ఆస్ట్రేలియాలోని సముద్ర తీరంలో వింత (మిస్టీరియస్)వస్తువు  ఒకటి ప్రత్యేక్షమైంది. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యపోవడంతో పాటు చర్చనీయాంశమైంది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్ బీచ్‌లో కనిపించిన ఈ సిలిండర్‌ను చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. దాని ఆకారం కాస్త ప్రమాదకరంగా.. సిలిండర్ లా ఉండటంతో ఆ వస్తువుకు దూరంగా ఉండమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మిడ్-వెస్ట్ కోస్ట్‌లోని గ్రీన్ హెడ్ టౌన్ సమీపంలో స్థానికులు దీనిని గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం ఆ వస్తువు గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వస్తువు ఏదైనా ప్రమాదాన్ని కలిగిస్తుందో లేదో తెలుసుకోవడానికి అధికారులు ప్రస్తుతం ఆ వస్తువు యొక్క మూలాలను పరిశీలిస్తున్నారు.

ప్రాథమిక ఊహాగానాల ప్రకారం.. ఆ వస్తువును తప్పిపోయిన మలేషియా MH370 విమానానికి చెందిన భాగంగా అనుమానిస్తున్నారు.  అదే సమయంలో ఇది వాణిజ్య విమానం యొక్క భాగం కాదనీ, తాము నమ్మడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. తదుపరి సమాచారం లభించే వరకు ఎటువంటి నిర్ధారణలకు దూరంగా ఉండాలని వారు ప్రజలను కోరారు. దర్యాప్తు సమగ్రతను కొనసాగించడానికి, పశ్చిమ ఆస్ట్రేలియా పోలీసు దళం వస్తువును రక్షిస్తుంది.

ఆ అనుమానాస్పద వస్తువుపై పరిశీలించడానికి ఆస్టేలియా సైన్యం తో పాటు ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ కూడా పాల్గొంటుంది.  ఇది ‘ఫారిన్ స్పేస్ రాకెట్’కి చెందిన వ్యర్థ ఇంధన సిలిండర్ కావచ్చని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ఇది భారత్ చెందిన చంద్రయాన్ 3  రాకెట్‌కు చెందింది కావచ్చునని నిపుణులు భావిస్తున్నారు.. అదే సమయంలో అది ఇంధన సిలిండర్ అయితే.. అందులో విషపూరిత పదార్థాలు ఉండవచ్చని, దానికి దూరంగా ఉండాలని పర్యటకులను హెచ్చరిస్తున్నారు.

ఈ వస్తువు గురించి అంతరిక్ష పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ అలిస్ గోర్మాన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ వస్తువు భారత్ కు చెందిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రాకెట్ లేదా చంద్రయాన్-3 ఇంధన సిలిండర్ కావచ్చునని అభిప్రాయ పడ్డారు. ఆ శకలం పరిమాణం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. చంద్రయాన్ ప్రయోగ సమయంలో విడిపోయిన రాకెట్ శకలం కావచ్చునని భావిస్తున్నారు. ఒడ్డుకు కొట్టుకుపోయిన వస్తువు విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనంలో భాగమా? కాదా? అని నిర్ధారించడాన్ని ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ లక్ష్యంగా పెట్టుకుంది. 

ఆ సిలిండర్ గురించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు వారు అంతర్జాతీయ సహచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. దాని గురించి తెలుసుకోవడానికి మూలాలను పరిశీలిస్తున్నారు. ఆ వస్తువును తాకడం లేదా అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించడం మానుకోవాలని ఏజెన్సీ నొక్కి చెప్పింది.ఆస్ట్రేలియన్ అంతరిక్ష సంస్థ ఈ విషయంపై స్పందిస్తూ.. విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనం (రాకెట్) నుండి జెయింట్ సిలిండర్ పడిపోయే అవకాశం ఉందని, ఈ విషయమై ఇతర అంతర్జాతీయ ఏజెన్సీలతో చర్చిస్తున్నామని తెలిపింది.

ఆ వస్తువుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వైరలవుతున్న చిత్రాలను పరిశీలిస్తే.. రాగి రంగులో ఉన్న ఓ సిలిండర్ లా ఉంది. అది వేరొకదాని నుండి వేరు చేయబడినట్లు అనిపిస్తుంది. దాని దిగువ భాగం నలిగిపోయినట్లు కనిపిస్తుంది. ఎలా అక్కడికి వచ్చింది? ఆ వస్తువు దేనికి సంబంధించిందనే ప్రశ్నలను లేవనెత్తుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios