దుమారం రేపుతున్న ఇమ్రాన్ ఖాన్  మాజీ భార్య బుక్


ఇస్లామాబాద్: తాను రాసిన పుస్తకంలో అన్నీ వాస్తవాలే ఉన్నాయని మాజీ క్రికెటర్ , పాకిస్తాన్ తెహ్రీక్ ఐ ఇన్‌సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ సతీమణి రెహమ్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ పుస్తకంపై పెద్ద ఎత్తున దుమారం చేలరేగింది. ఈ తరుణంలో ఆమె ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు.

తాను రాసిన ‘ టెల్‌-ఆల్‌’లో ఉన్న విషయాలన్నీ వాస్తవాలేనని ఆమె చెప్పుకొచ్చారు. సామాజిక వేత్త, జర్నలిస్టు అయిన రెహామ్‌ ఖాన్‌ ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. . ‘నా ఆత్మకథ నుంచి కొన్ని విషయాలు బహిర్గతమై వివాదాస్పదమయ్యాయి. కానీ అవన్నీ వాస్తవాలే. అందరికీ నిజాలు తెలియాలనే ఈ పుస్తకాన్ని రాసాను. ఈ పుస్తక విడుదల విషయంలో తనను హత్య చేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయని ఆమె గుర్తు చేశారు. తాను ఎవరి బెదిరింపులకు కూడ భయపడనని ఆమె చెప్పారు.

ఈ పుస్తకంలో తన జీవిత ప్రయాణం వివరించినట్టు ఆమె చెప్పారు. తన జర్నలిజం జీవితంతో పాటు యాంకర్‌గా మారడం గ్లామరస్‌ లైఫ్‌ అన్ని విషయాలు ప్రస్తావించిన విషయాన్ని ఆమె గుర్తుచేసుకొన్నారు. 

ఈ పుస్తకంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ గే అని, పెళ్లికి ముందే తనను వేధించాడని పేర్కొనడం.. వసీం అక్రమ్‌ సతీమణి గురించి రాసిన విషయాలు బయటకి రావడం తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఇమ్రాన్‌ఖాన్‌ ఈ పుస్తకాన్ని పాకిస్తాన్‌లో విడుదల చేయకుండా అడ్డుకోవాలని కోర్టును ఆశ్రయించారు.