260 మృతదేహాలు.. మ్యూజిక్ ఫెస్ట్‌పై హమాస్ నరమేధం.. ఇజ్రాయెల్‌లో మాటలకందని విషాదం.. (వీడియో)

ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు విరుచుకుపడటంతో.. పరిస్థితులు భీకర పరిస్థితులు నెలకొంది. ప్రస్తుతం అక్కడ మాటలకందని విషాదం నెలకొంది.

Music festival turns horrific in Israel as Hamas kills 260 Videos minutes before terror attack Ksm

ఇజ్రాయెల్‌లో హమాస్ మిలిటెంట్లు విరుచుకుపడటంతో.. పరిస్థితులు భీకర పరిస్థితులు నెలకొంది. ప్రస్తుతం అక్కడ మాటలకందని విషాదం నెలకొంది. అయితే హమాస్ దాడులతో జరిగిన నష్టం ఇప్పుడిప్పుడే వెలుగుచూస్తుంది. హమాస్ దాడులతో.. ఓ మ్యూజిక్ ఫెస్టివల్‌ శవాల దిబ్బగా మారిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌లో హమాస్ దాడితో దాదాపు 260 మంది మరణించారు. వివరాలు.. ఆదివారం గాజాకు సమీపంలోని కిబ్బట్జ్ రీమ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సంగీత ఉత్సవమే నోవా మ్యూజిక్ ఫెస్టివల్. 

యూదుల సెలవుదినం సుక్కోట్ ముగింపు సందర్భంగా జరుపుకునే సంగీత ఉత్సవం ఇది. ఈ వేడుకలో దాదాపు 3,000 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. అయితే ఒక్కసారిగా ఆ ప్రదేశం వైపు రాకెట్లు దూసుకొచ్చాయి. దీంతో అప్పటివరకు అక్కడ ఉల్లాసంగా ఉన్న వాతావరణం.. అరుపులు, కేకలతో నిండిపోయింది. జనాలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీయడం మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఎక్స్(ట్విట్టర్)లో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలు చూస్తే.. హమాస్ దాడులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. 

 

మ్యూజిక్ ఫెస్ట్ నుంచిదాదాపు 260 మృతదేహాలను తమ వైద్యాధికారులు తొలగించారని ఇజ్రాయెలీ రెస్క్యూ సర్వీస్ జకా తెలిపింది. ఇక, ఉగ్రవాదులు ఫెస్ట్‌లో పాల్గొనేవారిని చుట్టుముట్టి.. రైఫిల్ కాల్పులతో పదుల సంఖ్యలో ప్రజలను కాల్చి చంపారు. దీని తరువాత, ఉగ్రవాదులు ఆ ప్రాంతం గుండా వెళ్లి.. దాక్కున్న వ్యక్తులను ఉరితీయడానికి లేదా వారిని బంధించేందుకు వేటను కొనసాగించారు.  

 

‘‘హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంపై దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్‌లో సంగీత ఉత్సవం వైపు క్షిపణులు ఎగురుతూ కనిపించాయి’’ అని  ఒక నెటిజన్ ఎక్స్‌లో వీడియో పోస్టు చేశారు. మరో వీడియోలో.. 25 ఏళ్ల ఇజ్రాయెలీ మహిళ నోవా అర్గమణిని హమాస్ ఉగ్రవాది మోటర్‌సైకిల్‌పై తీసుకెళ్లడం కనిపించింది, ఆమె తన ప్రాణాలను కాపాడుకోవడానికి.. ‘‘నన్ను చంపవద్దు! వద్దు, వద్దు, వద్దు’’ అని వేడుకుంది. ఆర్గమణి ఉగ్రవాదులకు పట్టుబడగా.. ఆమె ప్రియుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios