Asianet News TeluguAsianet News Telugu

Monkeypox : ఐరోపాలో మంకీపాక్స్ క‌ల‌క‌లం.. 100 దాటిన‌ కేసులు.. అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించిన డ‌బ్లూహెచ్ వో

మంకీపాక్స్ కలకలం రేపుతోంది. పలు దేశాల్లో ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. యూరప్ లో ఈ కేసులు 100 దాటాయి. ఆఫ్రికా బయట చాలా అరుదుగా కనిపించే ఈ వైరస్.. ఇప్పుడు వేగంగా వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. 

More than 100 monkeypox cases in Europe .. Emergency meeting Managed by WHO
Author
New Delhi, First Published May 21, 2022, 9:52 AM IST

ఐరోపాలో మంకీపాక్స్ విజృంభిస్తోంది. ఈ వైర‌స్ వెలుగులోకి వ‌చ్చిన కొన్ని రోజుల్లోనే 100కి పైగా కేసులు నిర్ధారణ అయ్యాయి. పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో అత్యంత సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ అయిన మంకీపాక్స్ ఇటీవల వ్యాప్తి చెంద‌డంపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అప్ర‌మ‌త్తం అయ్యింది. ఈ నేప‌థ్యంలో శుక్రవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ కింగ్ డ‌మ్ తో పాటు యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి తొమ్మిది దేశాల్లో ఈ వైర‌స్ కేసులు నమోదయ్యాయి. 

స్పెయిన్ లో శుక్రవారం 24 కొత్త కేసులు వెలుగులోకి వ‌చ్చాయి. ఇజ్రాయెల్‌లోని ఓ హాస్పిట‌ల్ లో తన 30 ఏళ్ల వయస్సులో ఉన్న వ్యక్తికి చికిత్స పొందుతున్నాడు. అతను ఇటీవల పశ్చిమ ఐరోపా నుండి వ‌చ్చారు. అప్ప‌టి నుంచి వ్యాధి ల‌క్ష‌ణాల‌ను క‌న‌బ‌రుస్తున్నాడు. అయితే ఈ వ్యాధి సాధారణంగా వైర‌స్ సోకిన వ్య‌క్తితో సన్నిహిత మెల‌గ‌డం ద్వారానే వ్యాప్తిస్తుంది. ఆఫ్రికా వెలుపల చాలా అరుదుగా క‌నిపిస్తుంటుంది.కానీ ఇప్పుడు ఈ కేసుల పెరుగుదల ఆందోళనను రేకెత్తిస్తోంది. అయిన‌ప్ప‌టికీ ఈ వైరస్ SARS-COV-2 అంత వేగంగా వ్యాప్తి చెందే అవ‌కాశం లేదు. కాబ‌ట్టి ఇది COVID-19 వంటి మహమ్మారిగా పరిణామం చెందే అవ‌కాశం లేద‌ని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

North Korea: కరోనా‎‎తో గజగజ వణుకుతున్న నార్త్ కొరియా.. కషాయాలు, టీలు తాగండి అంటూ సలహా

మంకీపాక్స్ సాధారణంగా ఒక తేలికపాటి వైరల్ ఇన్ఫెక్ష‌న్. ఈ వైర‌స్ సోకితే జ్వరం ల‌క్ష‌ణాల‌తో పాటు శ‌రీరంపై విలక్షణమైన ఎగుడు దిగుడు దద్దుర్లు క‌నిపిస్తాయి. ‘‘ ఐరోపాలో ఇప్పటివరకు కనిపించని మంకీపాక్స్ అతిపెద్ద, అత్యంత విస్తృతమైన వ్యాప్తి ఇది’’ అని జర్మనీ సాయుధ దళాల వైద్య సేవ తెలిపింది. ఈ వైర‌స్ నేప‌థ్యంలో దీనిపై చర్చించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కు చెందిన స్టాగ్-ఐహెచ్ క‌మిటీ స‌మ‌వేశం అయ్యింది. 

ఈ వ్యాధి సాధార‌ణ ప్రజలకు వ్యాపించే అవకాశం త‌క్కువ‌గా క‌నిపిస్తోంద‌ని సీనియర్ US అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ ఒక‌రు తెలిపారు. ఈ వ్యాధిని రాబర్ట్ కోచ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన  ఫాబియన్ ఫాబియన్ లీండర్ట్జ్ అంటువ్యాధిగా అభివర్ణించారు. అయితే ఈ వ్యాప్తి ఎక్కువ కాలం కొన‌సాగే అవ‌కాశం లేద‌ని అన్నారు. కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా కేసులను త్వ‌ర‌గా వేరు చేయ‌వ‌చ్చ‌ని అన్నారు. అవసరమైతే మందులు, సమర్థవంతమైన వ్యాక్సిన్‌లను కూడా ఉపయోగించవచ్చ‌ని సూచించారు. అయిన‌ప్ప‌టికీ వేసవి నెలల్లో, పార్టీలు, పండుగల స‌మ‌యంలో ప్ర‌జ‌లు గుమిగూడడం వల్ల ఈ వ్యాధి ఎక్కువ‌గా వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంద‌ని WHO యూరోపియన్ చీఫ్ ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

వైరల్ వీడియో : కోతికి కుక్క సాయం.. రెండూ తోడు దొంగలే..!

కాగా ఇప్ప‌టి వ‌ర‌కు మంకీపాక్స్‌కు నిర్దిష్ట వ్యాక్సిన్ లేదు. WHO ప్రకారం.. మశూచిని నిర్మూలించడానికి ఉపయోగించే టీకాలు కోతులకు వ్యతిరేకంగా 85% వరకు ప్రభావవంతంగా ఉన్నాయని డేటా తెలుపుతోంది. మంకీపాక్స్‌కు గురైన కొందరు ఆరోగ్య కార్యకర్తలు, ఇతరులకు మశూచి వ్యాక్సిన్‌ను అందించినట్లు బ్రిటిష్ అధికారులు తెలిపారు. ఈ వైర‌స్ 1970 సంవ‌త్స‌రం నుంచి 11 ఆఫ్రికన్ దేశాల్లో నమోదయ్యాయి. నైజీరియాలో 2017 నుంచి వ్యాప్తి క‌నిపిస్తోంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు 46 అనుమానిత కేసులు ఉన్నాయి. వాటిలో 15 కేసుల‌ను నిర్ధారించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios